
స్టీవ్ స్మిత్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మెక్‌గ్రాత్
ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌పై ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ మాత్రం స్టీవ్ స్మిత్ టెక్నికల్‌గా చూస్తే సరైన బ్యాట్స్‌మన్ కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్మిత్ టెక్నిక్ చాలా వీక్‌గా ఉంటుందని, కాకపోతే పిచ్ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఆడటంలో సిద్ధహస్తుడని అన్నాడు.

ఒక స్పెషల్ క్రికెటర్‌గా నిలుస్తాడు
ప్రస్తుతం ఎమ్ఆర్ఎఫ్ పేస్ పౌండేషన్‌కు హెడ్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ పేస్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్ మాట్లాడుతూ "స్మిత కెరీర్ ముగిసే సమయానికి ఒక స్పెషల్ క్రికెటర్‌గా నిలుస్తాడు. అతని టెస్టు యావరేజ్ ప్రస్తుతం 60కి పైగా ఉంది. కాకపోతే సాంకేతికంగా చూస్తూ స్మిత్ ఆట తీరు సరైనది కాదు" అని అన్నాడు.

మ్యాచ్ పరిస్థితుల్ని అర్ధం చేసుకుని
"మ్యాచ్ పరిస్థితుల్ని అర్ధం చేసుకునే ఆడే కొంతమంది క్రికెటర్లలో స్మిత్ కూడా ఒకడు. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ పరంగా చూస్తే క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి స్మిత్ ఎక్కవ సమయం తీసుకుంటాడనేది వాస్తవం. దాంతోనే పలు ప్రత్యేకమైన ఇన్నింగ్స్‌ల్ని స్మిత్ నమోదు చేస్తున్నాడు" అని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు.
సచిన్ సైతం తన ట్విట్టర్‌లో ఇలా
ఎడ్జిబాస్టన్ టెస్టులో స్మిత్ ఇన్నింగ్స్‌పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సైతం ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. 'స్మిత్ అద్భుతంగా ఆడావు. టెస్టుల్లో క్రికెట్‌లో ఈ విధంగా పునరాగమనం చేయడం బాగుంది. నాథన్ లయన్ సూపర్ బౌలింగ్ చేశాడు. యాషెస్ తొలి టెస్టు గెలిచినందుకు ఆసీస్ జట్టుకు అభినందనలు' అని సచిన్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












