విరాట్ కోహ్లీ గొప్పే ఆటగాడే కానీ, స్మిత్ మరొక స్థాయి ఆటగాడు

హైదరాబాద్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌పై ఆ జట్టు టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో ఇప్పటికే 134.2 యావరేజితో ఏకంగా 671 పరుగులు చేశాడు.
ఆదివారంతో ముగిసిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 82 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

2-1తో యాషెస్ సిరిస్ కైవసం
ఒల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం టిమ్ పైన్ మాట్లాడుతూ "నేను చూసిన బ్యాట్స్‌మెన్‌లో స్టీవ్ స్మిత్ అత్యుత్తమం. నాలుగో టెస్టులోనూ సత్తా చూపించాడు. అతడు మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకొని ఆడతాడు" అని అన్నాడు.

స్మిత్‌పై ప్రశంసల వర్షం
ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ సైతం స్మిత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. "మా జట్టులో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ కమిన్స్, అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ ఉన్నారు. విరాట్ కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్. అతడు అన్ని ఫార్మాట్స్‌లో రాణిస్తాడు. కానీ, స్టీవ్ స్మిత్ మరొక స్థాయి ఆటగాడు" అని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పాడు.

ఏడాది తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో
మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ "మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడాన్ని నేను ఆస్వాదిస్తున్నా. ఏడాది తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ ఆడుతున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. జట్టుకోసం పోరాడుతున్నాను" అని చెప్పుకొచ్చాడు. నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications