యాషెస్ 4వ టెస్టులో సెంచరీ: టెస్టుల్లో విరాట్ కోహ్లీని అధిగమించిన స్టీవ్ స్మిత్

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ తన జోరుని కొనసాగుతున్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. 163 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో స్టీవ్ స్మిత్ 101 పరుగులు చేశాడు.
ఈ సిరిస్‌లో మూడో సెంచరీ
ఈ సిరిస్‌లో స్టీవ్ స్మిత్‌కు ఇది మూడో సెంచరీ కాగా, మొత్తంగా చూస్తే టెస్టు క్రికెట్‌లో 26వ సెంచరీ కాడవం విశేషం. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (25 టెస్టు సెంచరీలు) రికార్డుని స్టీవ్ స్మిత్ అధిగమించాడు. స్టీవ్ స్మిత్ 26 సెంచరీలు సాధించేందుకు 67 టెస్టులు ఆడాడు.

కోహ్లీ 79 టెస్టుల్లో 25 సెంచరీలు
అదే, విరాట్ కోహ్లీ 79 టెస్టుల్లో 25 సెంచరీలు సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం గ్యారీ సోబర్స్‌తో సంయుక్తంగా స్టీవ్ స్మిత్ 19వ స్థానంలో కొనసాగుతున్నాడు. 51 టెస్టు సెంచరీలతో ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
మార్క్ వా రికార్డు బద్దలు
అదే సమయంలో యాషెస్ సిరిస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మార్క్ వా రికార్డుని స్టీవ్ స్మిత్ బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు మొత్తం 26 యాషెస్ టెస్టులు ఆడిన స్టీవ్ స్మిత్ 11 సెంచరీలతో మార్క్ వా(10 సెంచరీలు) రికార్డుని అధిగమించాడు. మరోవైపు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాక్ హాబ్స్ కూడా 10 సెంచరీలు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications