Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2019: లీడ్స్‌లో నాథన్ లయాన్ ఆ ఘనత అందుకునేనా?

Ashes 2019: Nathan Lyon one wicket away from surpassing Dennis Lillee in elite list

హైదరాబాద్: ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయాన్‌ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. 31 ఏళ్ల నాథన్ లయాన్ మరో వికెట్ తీస్తే ఆస్ట్రేలియా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. టెస్టుల్లో నాథన్ లయాన్ ప్రస్తుతం 355 వికెట్లతో మాజీ పేస్ దిగ్గజం డెన్నిస్‌ లిల్లీతో సమానంగా నిలిచాడు.

డెన్నిస్ లిల్లీ రికార్డు సమం

డెన్నిస్ లిల్లీ రికార్డు సమం

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో లయాన్ 3-68 ప్రదర్శనతో డెన్నిస్ లిల్లీ రికార్డుని సమం చేశాడు. అంతేకాదు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను 258 పరుగులకే కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా హెడెంగ్లీ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది.

నాథన్ లయాన్ మాట్లాడుతూ

నాథన్ లయాన్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో నాథన్ లయాన్ మాట్లాడుతూ "వ్యక్తిగత మైలురాళ్ల కోసం నేను ఆరాటపడను. సుదీర్ఘ ఫార్మాట్‌లో జట్టును గెలిపించాలనే ఆలోచిస్తాను. రికార్డుల గురించి ఆలోచించే సమయం నాకు లేదు. షేన్ వార్న్‌, మెక్‌గ్రాత్, లిల్లీతో నన్ను నేను చూసుకోవడానికి కృషిచేస్తున్నాను" అని వెల్లడించాడు.

70 టెస్టులు ఆడి 355 వికెట్లు

70 టెస్టులు ఆడి 355 వికెట్లు

ఇక, 1984లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డెన్నిస్ లిల్లీ ఆస్ట్రేలియా తరుపున 70 టెస్టులు ఆడి 355 వికెట్లు తీయగా... నాథన్ లయాన్ 88 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో 12 వికెట్లు తీయడం ద్వారా ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రా

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రా

ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా... లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ప్రస్తుతం యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో తొలి రోజు వర్షం కారణంగా ఆట తుడిచిపెట్టుకు పోగా ఆ తర్వాత ఉత్కంఠగా మారి... చివరకు డ్రాగా ముగిసింది.

Story first published: Wednesday, August 21, 2019, 17:18 [IST]
Other articles published on Aug 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+