న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓడిపోవడం బాధిస్తుంది.. మేము సిరీస్‌ను మాత్రం కోల్పోము: రూట్

Ashes 2019 : Joe Root Wants Team To Bounce Back In Fifth Ashes Test || Oneindia Telugu
Ashes 2019: Losing hurts, team to bounce back in fifth Test says Joe Root

మాంచెస్టర్‌: యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఓడిపోవడం బాధిస్తుంది. అయినా మేము తిరిగి పంజుకుంటాం, చివరి టెస్టులో విజయం సాధిస్తాం అని ఇంగ్లాండ్‌ కెప్టెన్ జో రూట్‌ ధీమా వ్యక్తం చేసాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లోని నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ 185 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్‌ ఓటమితో ఆసీస్ 2-1తో సిరీస్ ఆధిక్యంలో నిలవడంతో పాటు ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ను నిలబెట్టుకుంది.

<strong>భారత్‌ vs దక్షిణాఫ్రికా: 15 నుంచి వైజాగ్‌ టెస్ట్‌ మ్యాచ్ టికెట్ల విక్రయం</strong>భారత్‌ vs దక్షిణాఫ్రికా: 15 నుంచి వైజాగ్‌ టెస్ట్‌ మ్యాచ్ టికెట్ల విక్రయం

సిరీస్‌ను కోల్పోము:

సిరీస్‌ను కోల్పోము:

మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్‌ కెప్టెన్ జో రూట్‌ మాట్లాడుతూ... 'నిజాయితీగా చెపుతున్నా ఈ ఓటమి బాధిస్తుంది. తీవ్ర నిరాశకలిగించింది. ఛేదనలో జట్టులోని ప్రతి ఆటగాడు బాగా పోరాడతాడని భావించాను. కానీ అలా జరగలేదు. జట్టులో లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. నాతో పాటు ఆటగాళ్లు అందరూ మంచి ప్రదర్శన చేయాల్సి ఉంది. వచ్చే వారం ముఖ్యమైన ఐదవ టెస్ట్ మ్యాచ్ ఉంది. ఇందులో గెలిచి ఈ వేసవిని ఘనంగా ముగించేయాలనుకుంటున్నాం. ఛాంపియన్‌షిప్లో పాయింట్లు ముఖ్యం కాబట్టి ఈ సిరీస్‌ను కోల్పోవాలనుకోవడం లేదు' అని రూట్ తెలిపాడు.

చివరి టెస్టులో విజయం సాధిస్తాం:

చివరి టెస్టులో విజయం సాధిస్తాం:

'టాస్‌ చాలా కీలకం. తొలి ఇన్నింగ్స్‌లో మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయాం. స్టీవ్‌ స్మిత్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ప్రపంచ క్లాస్ ప్లేయర్‌. అతడిని తొందరగా ఔట్‌ చేస్తే.. విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆసీస్‌ బౌలర్లుగా బాగా బౌలింగ్‌ చేశారు. అయినా వారిని సమర్థంగానే ఎదుర్కొన్నాం. ఈ ఓటమి నుంచి పాఠాలను నేర్చుకుంటాం. తిరిగి పుంజుకొని చివరి టెస్టులో విజయం సాధిస్తాం' అని రూట్ అన్నాడు.

197 పరుగులకే ఆలౌట్:

197 పరుగులకే ఆలౌట్:

383 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 197 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. గత సిరీస్‌ను ఆసీస్ గెల్చుకోవడంతో.. ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో ఓడినా సిరీస్ 2-2తో సమం అవుతుంది. దీంతో ట్రోఫీ ఆసీస్ వద్దనే ఉంటుంది.

Story first published: Tuesday, September 10, 2019, 12:21 [IST]
Other articles published on Sep 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X