For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'చెత్త ప్రదర్శన చేసినా... డేవిడ్ వార్నర్ ఛాంపియన్ ప్లేయరే'

Ashes 2019: Justin Langer backs David Warner

హైదరాబాద్: ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఛాంపియన్ ప్లేయర్ అని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ వ్యాఖ్యానించాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో డేవిడ్ వార్నర్ పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో మొత్తం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ 95 పరుగులే చేశాడు. వార్నర్‌ చెత్త ప్రదర్శన ఆసీస్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

ఈ సిరిస్‌లో స్మిత్‌ ఒంటరి పోరాటం చేయగా.. వార్నర్‌ మాత్రం పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సిరీస్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌ను ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ ఏడు సార్లు ఔట్ చేశాడు. 10 ఇన్నింగ్స్‌లో డేవిడ్ కేవలం రెండు సార్లే డబుల్ డిజిట్ సాధించాడు. యాషెస్ సిరీస్‌ను వార్నర్ కేవలం 9.5 సగటుతో ముగించాడు.

వార్నర్ చెత్త ప్రదర్శనపై ఆస్ట్రేలియా అభిమానులు మండిపడుతుంటే... హెడ్ కోచ్ జస్టిన్‌ లాంగర్‌ మాత్రం అతడిని వెనకేసుకొచ్చాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ "నేను సుదీర్ఘకాలం నుంచి చూస్తున్నాను. ఎప్పటికీ ఛాంపియన్ ప్లేయర్లను కొట్టివేయకూడదు. వార్నర్‌కు ఈ సిరీస్‌ చాలా కష్టంగా గడిచింది" అని అన్నాడు.

"అందులో ఎలాంటి సందేహాం లేదు. అతడు చెత్త ప్రదర్శన చేసినప్పటికీ వార్నర్‌ ఎల్లప్పుడూ చాంపియన్‌ ప్లేయరే. తిరిగి ఫామ్‌ అందుకుంటాడని ఆశిస్తున్నా. ఛాంపియన్ ప్లేయర్స్‌ కూడా కొన్ని సార్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటారు. అంతమాత్రానా ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు" అని జస్టిన్ లాంగర్‌ చెప్పుకొచ్చాడు.

"ఈ సిరిస్‌లో ఓ ప్లాన్ ప్రకారం వెళ్లలేదు. ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టులో అతడి పాత్ర ఎంతో కీలకం. అతడు తిరిగి పుంజుకుంటాడని నాకు నమ్మకంగా ఉంది" అని లాంగర్ అన్నాడు. 399 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. మథ్యూ వేడ్ (166 బంతుల్లో 117 ; 17ఫోర్లు, సిక్సర్) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది.

ట్రోఫీని కోల్పోయినా.. ఆతిథ్య జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ 2-2తో సమం కాగా.. రెండో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. 47 ఏళ్ల తర్వాత యాషెస్‌ సిరీస్‌ డ్రా కావడం ఇదే తొలిసారి. సిరీస్‌ డ్రా అయినప్పటికీ, ట్రోఫీ మాత్రం ఆస్ట్రేలియా దగ్గరే ఉంటుంది. గత యాషెస్ సిరిస్‌లో ఆసీస్‌ గెలిచినందున ట్రోఫీని వారి వద్దే ఉండనుంది.

Story first published: Monday, September 16, 2019, 19:26 [IST]
Other articles published on Sep 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+