న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రాడమన్‌ రికార్డు బ్రేక్‌.. కుక్, సచిన్ ఎలైట్ జాబితాలో రూట్!!

Ashes 2019: Joe Root Half Century joins Alaistar Cook, Sachin Tendulkars elite list

లండన్‌: ఓవల్‌లో జరుగుతున్న ఐదవ యాషెస్ టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఎట్టకేకలకు అర్ధ శతకం (141 బంతుల్లో 57; 3 ఫోర్లు) చేశాడు. ఓపెనర్ జో డెన్లీ త్వరగానే పెవిలియన్ చేరినా.. బర్న్స్‌ (87 బంతుల్లో 57; 7 ఫోర్లు) తోడుగా రూట్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. రూట్ అర్ధ శతకం చేసి ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు సర్‌ బ్రాడమన్‌ను అధిగమించడంతో పాటు తన క్రికెట్ కెరీర్‌లో ఒక మైలురాయిని చేరుకున్నాడు.

<strong>సచిన్‌ రికార్డులకు చేరువగా ఎవరూ వస్తారనుకోలేదు.. కోహ్లీపై కపిల్‌దేవ్‌ ప్రశంసలు</strong>సచిన్‌ రికార్డులకు చేరువగా ఎవరూ వస్తారనుకోలేదు.. కోహ్లీపై కపిల్‌దేవ్‌ ప్రశంసలు

 రూట్@70000

రూట్@70000

ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రూట్‌ 57 పరుగులు చేయడంతో టెస్టుల్లో 7వేల మార్కును అందుకున్నాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌లో పిన్న వయసులో 7వేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో ఆటగాడిగా రూట్‌ రికార్డుల్లో నిలిచాడు. పిన్న వయసులో ఈ ఘనత సాధించిన సచిన్‌ టెండూల్కర్‌, అలెస్టర్‌ కుక్‌ల ఎలైట్ జాబితాలో చోటు సంపాదించాడు. 7వేల పరుగులను కుక్‌ 27 ఏళ్ల 346 రోజుల వయసులో చేస్తే.. సచిన్‌ 28 ఏళ్ల 193 రోజుల వయసులో చేసాడు. ఇక రూట్‌ 28 ఏళ్ల 256 రోజుల వయసులో సాధించాడు.

బ్రాడమన్‌ను అధిగమించిన రూట్‌:

బ్రాడమన్‌ను అధిగమించిన రూట్‌:

మరోవైపు ఆల్‌ టైమ్‌ టెస్టు పరుగుల జాబితాలో ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు సర్‌ బ్రాడమన్‌ను రూట్‌ అధిగమించాడు. బ్రాడమన్‌ తన కెరీర్‌లో 6,996 పరుగులు చేస్తే.. రూట్ 7వేల పరుగులు పూర్తి చేసాడు. ఈ జాబితాలో సచిన్‌ (15,921) తొలి స్థానంలో ఉన్నాడు. రికీ పాంటింగ్ (13,378), జాక్ కలిస్ (13,289), రాహుల్ ద్రావిడ్ (13,288), కుక్ (12,472) వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.

అత్యధిక టెస్టు ఇన్నింగ్స్‌లు:

అత్యధిక టెస్టు ఇన్నింగ్స్‌లు:

ఇక 86వ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న రూట్‌ వేగవంతంగా అత్యధిక టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన నాలుగో ఇంగ్లండ్‌ ఆటగాడిగా కూడా రికార్డుల్లోకి ఎక్కాడు. యాషెష్ ఐదో టెస్టు రూట్‌కు 158 టెస్టు ఇన్నింగ్స్‌. రూట్ తన టెస్టు కెరీర్‌లో 45వ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆసీస్ ఫీల్డర్లు మూడుసార్లు క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన రూట్.. ఎట్టకేలకు 45వ అర్ధ శతకం చేశాడు.

 ఆదుకున్న బట్లర్‌:

ఆదుకున్న బట్లర్‌:

యాషెస్‌ ఐదో టెస్టులో చోటు దక్కించుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ విజృంబించాడు. నిప్పులు చెరిగే బంతులతో మార్ష్ నాలుగు వికెట్లు తీయడంతో ఆతిధ్య ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. ఓవల్‌ మైదానంలో గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మార్ష్ దెబ్బకు ఇంగ్లండ్‌ ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్‌ (64), జాక్ లీచ్ (10) ఉన్నారు. ఆసీస్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

Story first published: Friday, September 13, 2019, 12:27 [IST]
Other articles published on Sep 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X