Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్మిత్ vs ఆర్చర్: మూడో టెస్టు ఆడనప్పుడు నేను ఎలా ఔట్‌ చేస్తా

Ashes 2019: Jofra Archer Responds To Steve Smith Challenge Ahead Of Manchester Test
Ashes 2019: I cant get him out if he wasnt there: Jofra Archer

హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా నాలుగో టెస్టు సెప్టెంబర్ 4 నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆరంభానికి ముందే స్టీవ్ స్మిత్-జోఫ్రా ఆర్చర్‌ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జోఫ్రా ఆర్చర్‌ విసిరిన బౌన్సర్‌‌ స్టీవ్ స్మిత్ మెడను బలంగా తాకింది.

మైదానంలో కుప్పకూలిన స్మిత్

మైదానంలో కుప్పకూలిన స్మిత్

దీంతో మైదానంలో స్మిత్‌ కుప్పకూలాడు. అనంతరం ఫిజియో రావడం.. అతడు తేరుకోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, తనకు గాయమైన మరుక్షణం ఫిలిప్ హ్యూస్ విషాదం కళ్లముందు కదలాడిందని స్మిత్‌ తాజాగా చెప్పుకొచ్చాడు. తాజాగా స్టీవ్‌ స్మిత్‌ గాయం నుంచి కోలుకున్నాడు.

డెర్బీషైర్‌తో మ్యాచ్‌లో స్మిత్

డెర్బీషైర్‌తో మ్యాచ్‌లో స్మిత్

నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా టూర్ మ్యాచ్‌లో భాగంగా గురువారం నుంచి డెర్బీషైర్‌తో మూడు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది. గాయం నేపథ్యంలో స్మిత్‌కు ఆర్చరే ప్రధాన ప్రత్యర్థి అని పలువురి విశ్లేషించడంతో స్మిత్ మాట్లాడుతూ "నాకు ఆర్చర్‌ ఒక్కడే టార్గెట్‌ కాదు. నన్ను ఔట్‌ చేయడంలో చాలా మంది ఇంగ్లిష్‌ బౌలర్లు సక్సెస్‌ అయ్యారు. నేను గాయపడ్డ టెస్టులో నేను ఆర్చర్‌కు వికెట్‌ ఇవ్వలేదు కదా" అని అన్నాడు.

స్మిత్ వ్యాఖ్యలపై స్పందించిన జోఫ్రా ఆర్చర్

స్మిత్ వ్యాఖ్యలపై స్పందించిన జోఫ్రా ఆర్చర్

స్టీవ్ స్మిత్ వ్యాఖ్యలపై జోఫ్రా ఆర్చర్ చాలా సరదాగా సమాధానమిచ్చాడు. "నువ్వు అసలు మూడో టెస్టు ఆడనప్పుడు నేను ఎలా ఔట్‌ చేస్తా. ఆ టెస్టులో నేను తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశా. నేనేమీ ఏ ఒక్కరినో ఔట్‌ చేయడానికి ఇక్కడ లేను" అని కాస్త వెటకారంగా స్పందించాడు.

యాషెస్‌ సిరీస్‌ గెలవాలన్నదే మా కోరిక

యాషెస్‌ సిరీస్‌ గెలవాలన్నదే మా కోరిక

"నీ వికెట్‌ తీయడానికి మాత్రమే క్రికెట్‌ ఆడటం లేదు. నీ వికెట్ కాకపోతే మరో పది మందిని ఔట్ చేస్తా. కేవలం ఒక వికెట్ తీసేందుకే నేను ఇక్కడ లేను. యాషెస్‌ సిరీస్‌ గెలవాలన్నదే మా కోరిక. నిన్ను ఔట్‌ చేయడానికి నా ముందు చాలా సమయం ఉంది" అని ఆర్చర్ సవాల్ విసిరాడు.

Story first published: Thursday, August 29, 2019, 16:30 [IST]
Other articles published on Aug 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+