యాషెస్ సిరీస్ నిలుపుకున్న ఆసీస్.. 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!!

లండన్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ సమం చేసింది. సిరీస్ ఆద్యంతం వెనుకంజలోనే ఉన్న ఇంగ్లండ్ చివరి టెస్టులో ఘన విజయం సాధించి 2-2తో సమం చేసుకుంది. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (4/62), జాక్ లీచ్ (4/49) బౌలింగ్‌లో రాణించడంతో 135 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. 399 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ మథ్యూ వేడ్ (166 బంతుల్లో 117 ; 17ఫోర్లు, సిక్సర్) సెంచరీతో పోరాడినా ఆ జట్టు ఓటమిని నుండి తప్పించుకోలేకపోయింది.

18 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి:
యాషెస్ సిరీస్ 2-2తో సమం అయినా.. స్వదేశంలో జరిగిన గత యాషెస్‌ను గెల్చుకున్నందున ట్రోఫీ ఆ్రస్టేలియా వద్దనే ఉండనుంది. దీంతో ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ నిలుపుకోవడం 18 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. గతంలో (2001) స్టీవ్ వా సారథ్యంలో ఆసీస్ ఇంగ్లండ్‌లో సిరీస్ గెలిచింది.

47 తర్వాత తొలిసారి:
ఒక యాషెస్ సిరీస్ సమం కావడం 47 తర్వాత ఇదే తొలిసారి. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత అది పునరావృతం కావడం విశేషం. చివరిసారి 1972లో యాషెస్ సిరీస్ డ్రాగా ముగిసింది. అప్పుడు డ్రాగా ముగిసిన యాషెస్ కూడా ఇంగ్లండ్‌లోనే జరిగింది. ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ సిరీస్‌ను గెలిచి ఆసీస్‌కు చాలా కాలమే అయ్యింది. అయితే ఆసీస్‌కు ఈసారి ఆ అవకాశం అందినట్లే అంది చేజారింది.

వార్నర్ ఏడు సార్లు ఔట్:
ఈ సిరీస్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌ను ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ ఏడు సార్లు ఔట్ చేశాడు. 10 ఇన్నింగ్స్‌లో డేవిడ్ కేవలం రెండు సార్లే డబుల్ డిజిట్ సాధించాడు. యాషెస్ సిరీస్‌ను వార్నర్ కేవలం 9.5 సగటుతో ముగించాడు. వార్నర్‌ను ఏడు సార్లు ఔట్ చేసి బ్రాడ్ కొత్త టెస్ట్ రికార్డు సృష్టించాడు. ఒకే సిరీస్‌లో ఐదు సందర్భాల్లో మాత్రమే ఒక బౌలర్ ఏడు సార్లు ఔట్ చేసాడు. గత సిరీస్‌లో మొయిన్ అలీని నాథన్ లియాన్ ఔట్ చేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications