For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండు నెలల సుదీర్ఘ సిరిస్: యాషెస్ 2019 గురించి తెలుసుకోండి

Ashes 2019: Fixtures, results & squads

హైదరాబాద్: ప్రపంచకప్ ముగిసింది. లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలిసారి విశ్వవిజేతగా ఇంగ్లాండ్ నిలిచింది. ఇప్పుడిక యాషెస్ సిరిస్ వంతు వచ్చింది. సొంతగడ్డపై జరుగుతున్న యాషెస్‌ను ఇంగ్లాండ్ కాపాడుకుంటుందా? లేక ఆస్ట్రేలియాకు అప్పగిస్తుందా?

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

దీనికి సమాధానం యాషెస్ గణాంకాలే చెబుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని యాషెస్ సిరిస్‌లను గమనిస్తే ఆతిథ్య జట్టిదే పైచేయి. చివరగా ఇరు జట్లు తలపడిన యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా 4-0తో గెలిచింది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 70 యాషెస్‌ సిరీస్‌లు జరిగితే.. అందులో 33 సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.

ఐదు సిరీస్‌లు డ్రాగా

ఇంగ్లాండ్‌ 32 సార్లు విజయం సాధించింది. ఐదు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. ఇక, ఇంగ్లీషు గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్ సిరిస్ నెగ్గి సరిగ్గా 18 ఏళ్లవుతోంది. 2001లో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 4-1తో ట్రోఫీని నెగ్గిన ఆస్ట్రేలియా ఆ తర్వాత ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో యాషెస్ టెస్టు సిరీస్‌ గెలవలేదు.

ఈసారి భిన్నంగా యాషెస్ సిరిస్

ఈసారి భిన్నంగా యాషెస్ సిరిస్

ఆ తర్వాత 9 యాషెస్‌లు జరగ్గా ఇంగ్లాండ్‌ నాలుగు సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చింది. అందులో సొంతగడ్డపై జరిగిన ఐదు యాషెస్ సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా నాలుగింట విజయం సాధించి ఒకటి దాంట్లో ఓడిపోయింది. అయితే, ఈసారి యాషెస్ కాస్త భిన్నంగా జరుగుతోంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను అభిమానులకు మరింతగా చేరువ చేసేందుకు గాను ఐసీసీ ప్రవేశ పెట్టిన టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఈ సిరీస్‌తోనే మొదలవుతుంది.

రెండు నెలలు పాటు జరగనున్న యాషెస్

ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్ సుమారు రెండు నెలలు(ఏడు వారాలు)పాటు జరగనుంది. తొలి టెస్టు ఆగస్టు 1న ఎడ్జిబాస్టన్ వేదికగా ప్రారంభం కానుండగా... సెప్టెంబర్ 12న ప్రారంభమయ్యే ఆఖరి టెస్టుకు లండన్‌లోని ది ఓవల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

ఆగస్టు

ఆగస్టు

Aug 01 (Thu) - Aug 05 (Mon): England vs Australia 1st Test at Edgbaston, Birmingham

Aug 14 (Wed) - Aug 18 (Sun): England vs Australia 2nd Test at Lord's, London

Aug 22 (Thu) - Aug 26 (Mon): England vs Australia 3rd Test at Headingley, Leeds

సెప్టెంబర్

Sep 04 (Wed) - Sep 08 (Sun): England vs Australia 4th Test at Old Trafford, Manchester

Sep 12 (Thu) - Sep 16 (Mon): England vs Australia 5th Test at The Oval, London

మొదటి టెస్టుకు జట్ల వివరాలు:

మొదటి టెస్టుకు జట్ల వివరాలు:

ఇంగ్లాండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), స్టువర్ట్ బ్రాడ్, రోరే బర్న్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కుర్రాన్, జో డెన్లీ, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, ఆలీ స్టోన్, క్రిస్ వోక్స్.

ఆస్ట్రేలియా జట్టు: టిమ్ పైన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, పాట్రిక్ కమ్మిన్స్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, మైఖేల్ నేజర్, జేమ్స్ ప్యాటిన్సన్, పీటర్ సిడిల్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్.

Story first published: Wednesday, July 31, 2019, 17:06 [IST]
Other articles published on Jul 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+