
హైదరాబాద్: ప్రపంచకప్ ముగిసింది. ఇక, జట్లన్నీ టెస్టు ఛాంపియన్‌షిప్‌పై దృష్టి సారించాయి. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు యాషెస్ సిరిస్‌లో తలపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 1న ఎడ్జిబాస్టన్ వేదికగా జరగనుంది.
మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్
తొలి టెస్టుకు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉన్నాడని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ తెలిపాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా మోకాలి గాయం కారణంగా టోర్నీకే దూరమైన సంగతి తెలిసిందే.
అంతేకాదు మంగళవారం జరిగిన వార్మప్ టెస్టు మ్యాచ్‌కి సైతం ఉస్మాన్ ఖవాజా అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో ఖవాజా గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‍కి ఇచ్చిన ఇంటర్యూలో కెప్టెన్ టిమ్ పైనీ మాట్లాడుతూ అతడి గాయంపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు.
"ప్రస్తుతం అతడు రిహాబ్ స్టేజిలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అతడు అందుబాటులో ఉండడని నిర్ణయం తీసుకున్నాం. ఏ ఆటగాడైన గాయం కారణంగా ఆటకు దూరమైతే అతడి స్థానంలో సేవలందించేందుకు అతడు సిద్ధం. అందుకు పూర్తి ఫిట్‌నెస్ సాధించి తొలి టెస్టుకు అందుబాటులో ఉండాలని కోరాం" అని టిమ్ పైనీ అన్నాడు.
32 ఏళ్ల ఉస్మాన్ ఖవాజా నాలుగేళ్ల క్రితం ఇంగ్లాండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరిస్‌లో సైతం మూడో స్థానంలో అద్భుత ప్రదర్శన చేశాడు. 47.76 యావరేజితో ఎనిమిది సెంచరీలు సాధించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా యాషెస్ టెస్టు సిరిస్‌కు ఆస్ట్రేలియా జట్టుని ప్రకటించలేదు. టిమ్ పైనీ సారథ్యంలోని హిక్ XII-ట్రావిస్ హెడ్ సారథ్యంలోని హెడ్డన్ XII జట్టు వార్మప్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి.