Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రసవత్తరంగా యాషెస్: ఆస్ట్రేలియా 124/3.. నాలుగో ఇన్నింగ్స్‌ కష్టమే

Ashes 2019, England vs Australia 1st Test: James Pattinson backs Steve Smith to rescue Australia again

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు మ్యాచ్ అనేక మలుపులతో సాగింది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. సెంచరీ హీరో స్టీవ్‌ స్మిత్‌ (46 బ్యాటింగ్‌), ట్రవిస్‌ హెడ్‌ (21 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 49 పరుగులు జోడించారు.

34 పరుగుల ఆధిక్యం:

34 పరుగుల ఆధిక్యం:

రెండు ఇన్నింగ్స్‌లో వార్నర్‌ (8), బాన్‌క్రాఫ్ట్‌ (7) త్వరగా పెవిలియన్ చేరగా.. ఉస్మాన్‌ ఖవాజా (40) పర్వాలేదనిపించాడు. స్మిత్‌, హెడ్‌ మరో వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. వెలుతురు లేని కారణంగా అంపైర్లు ఆటను ముందుగా నిలిపివేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు వెనుకపడిన ఆస్ట్రేలియా.. ప్రస్తుతం 34 పరుగుల ఆధిక్యంలో ఉంది.

 స్మిత్‌పైనే ఆశలు:

స్మిత్‌పైనే ఆశలు:

ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చాలా కష్టమని సమాచారం. ఈ నేపథ్యంలో నాలుగో రోజు ఆసీస్ ఎన్ని పరుగులు చేసి ఇంగ్లండ్‌కు లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి. స్మిత్‌ ఎంతసేపు క్రీజులో ఉంటాడనేదానిపైనే ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

స్టోక్స్‌ అర్ధ సెంచరీ:

స్టోక్స్‌ అర్ధ సెంచరీ:

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 267/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ బర్న్స్‌ (133) ఆరంభంలోనే పెవిలియన్ చేరగా.. బెన్‌ స్టోక్స్‌ (50) అర్ధ సెంచరీ చేసాడు. ఆసీస్‌ బౌలర్లు చెలరేగి 18 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు తీసి ఆధిపత్యం చెలాయించింది. అయితే క్రిస్‌ వోక్స్‌ (37 నాటౌట్‌), స్టువర్ట్‌ బ్రాడ్‌ (29) పోరాడడంతో ఇంగ్లాండ్ పటిష్ట స్థితికి చేరుకుంది. దీంతో ఇంగ్లండ్‌కు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. కమిన్స్, లయన్‌ చెరో 3 వికెట్లు తీశారు.

Story first published: Sunday, August 4, 2019, 12:01 [IST]
Other articles published on Aug 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+