వార్నర్ ప్రమాదకర ఓపెనర్.. ఆరంభంలోనే కట్టడి చేయాలి

లండన్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అత్యంత ప్రమాదకర ఓపెనర్. అతన్ని ఇన్నింగ్స్ ఆరంభంలోనే కట్టడి చేయాలి అని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. యాషెస్ సిరీస్‌కు ఈరోజు తెర లేవనుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఈ రోజు మధ్యాహ్నం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. టెస్టు ఛాంపియన్‌షిప్ కూడా ఈ యాషెస్ సిరీస్‌తో ప్రారంభం కానుంది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

వార్నర్ ప్రమాదకర ఓపెనర్:
యాషెస్ సిరీస్ నేపథ్యంలో బెన్ స్టోక్స్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ... 'వార్నర్, స్మిత్, బెన్‌క్రాఫ్ట్ రాకతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ పటిష్టంగా మారింది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు డేవిడ్ వార్నర్ కీలకమైన ఆటగాడు. వార్నర్ అత్యంత ప్రమాదకర ఓపెనర్. అసాధారణమైన బ్యాటింగ్‌తో సులభంగా మ్యాచ్‌ను లాగేసుకుంటాడు. అతన్ని ఇన్నింగ్స్ ఆరంభంలోనే పెవిలియన్ చేర్చితే ఆధిపత్యం చెలాయించవచ్చు' అని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు.

తొలి రోజే ఆరంభం దొరికితే..:
'ఆస్ట్రేలియా అందరి బ్యాట్స్‌మెన్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాం. వారిని ఎదుర్కోవడానికి మా బౌలింగ్ బృందం సిద్ధంగా ఉంది. జట్టులో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు. అందరూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఏ జట్టుకైనా తొలి రోజే మంచి ఆరంభం దొరికితే.. అదే సానుకూల వాతావరణాన్ని మిగతా నాలుగు రోజులు కొనసాగించవచ్చు' అని స్టోక్స్ పేర్కొన్నాడు.

అత్యంత పోటీ:
'యాషెస్ ప్రపంచంలోనే అతిపెద్ద టెస్ట్ సిరీస్. యాషెస్ సిరీస్‌లో రెండు జట్ల మధ్య ఎప్పుడూ అత్యంత పోటీ ఉంటుంది. ఎప్పుడు ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చెప్పలేం. ఇప్పుడు కూడా పోటీ అలానే ఉంటుంది. రెండు జట్లు గెలవటానికి ప్రయత్నిస్తాయి' అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

హోరాహోరీ ఖాయం:
2017-18 సీజన్‌లో ఆసీస్‌లో జరిగిన యాషెస్‌ను ఆస్ట్రేలియా 4-0తో సొంతం చేసుకుంది. అంతకుముందు 2015లో స్వదేశంలో జరిగిన సిరీస్‌ను 3-2తో గెలుచుకున్న ఇంగ్లండ్.. మళ్లీ దానిని సాధించాలని పట్టుదలగా ఉంది. బలమైన జట్టు, ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహం, సొంతగడ్డపై సిరీస్ జరుగుతోన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. బాల్ టాంపరింగ్ వివాదం నుండి కోలుకోవడం, స్మిత్-వార్నర్‌ల పునరాగమనంతో ఆసీస్ కూడా సిరీస్‌పై ఆశలు పెట్టుకుంది. దీంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications