Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్నర్‌ స్టన్నింగ్ క్యాచ్: పెవిలియన్‌కు రూట్.. కష్టాల్లో ఇంగ్లండ్

Ashes 2019: David Warner takes super catch to dismiss Joe Root

లీడ్స్‌: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాల్లోకి ఎగిరి మరీ అద్భుత క్యాచ్ పట్టడంతో ఇంగ్లండ్ కెప్టెన్‌ జో రూట్‌ పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో హెడింగ్లే మైదానంలో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ ఎదురీదుతోంది. ఆదివారం ఓవర్ నైట్ స్కోర్ 156/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆతిథ్య జట్టుకు నాలుగో రోజు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. అప్పటికే అర్థ సెంచరీతో జట్టును ఆదుకున్న రూట్‌ (77) రెండు పరుగులు మాత్రమే జోడించి నిష్క్రమించాడు.

ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ వేసిన బంతిని రూట్‌ ముందుకొచ్చి ఆడాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకొని ప్యాడ్‌ను తాకి కీపర్‌ టిమ్ పైన్‌ మీదుగా వెళ్లింది. ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న వార్నర్‌ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. అనంతరం ఆసీస్‌ ఆటగాళ్లు మైదానం మొత్తం గంతులేస్తూ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు రూట్‌ మాత్రం నిరాశగా పెవిలియన్‌ చేరాడు. దీనికి సంబందించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

రూట్ నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన జానీ బెయిరిస్టో (34) అద్భుతంగా ఆడాడు. మరోవైపు బెన్‌ స్టోక్స్‌ (51) అతనికి చక్కటి సహకారం అందించాడు. స్టోక్స్‌ ఈ రోజు 49 పరుగులు చేసాడు. అయితే లంచ్ బ్రేక్ అనంతరం బెయిరిస్టో (36) క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జొస్ బట్లర్ (1) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. వోక్స్ (1) కూడా ఔట్ అవ్వడంతో ఇంగ్లండ్ కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టోక్స్‌ పోరాడుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో స్టోక్స్, ఆర్చర్ ఉన్నారు. ఆసీస్ బౌలర్ హాజల్ వుడ్ నాలుగు వికెట్లు తీసాడు. ఇంగ్లాండ్‌ విజయం సాధించాలంటే ఇంకా 98 పరుగులు చేయాలి. మరోవైపు ఆసీస్‌ విజయానికి 3 వికెట్లు కావాలి. మొదటి టెస్టు గెలిచి ఆసీస్‌ ముందంజలో ఉండగా.. రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, August 25, 2019, 19:14 [IST]
Other articles published on Aug 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+