Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రారంభమైన యాషెస్ సిరిస్: ఎప్పుడు, ఎక్కడ, ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి!

Ashes 2019 1st Test LIVE Streaming: When and where to watch England vs Australia Test live telecast online

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్ గురువారం ప్రారంభమైంది. ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. చివరగా ఈ రెండు జట్లు ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడించి ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకుంది.

లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి తొలిసారి విశ్వ విజేతగా నిలిచింది. కాగా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో సైతం ఇంగ్లాండ్ ఇదే జోరుని కొనసాగించాలని ఊవిళ్లూరుతోంది. ఇక, యాషెస్‌కు ఉన్న ఆదరణ గురించి చెప్పాల్సిన పనిలేదు.

సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను మరింతగా క్రికెట్ అభిమానులను చేరువ చేసేందుకు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందుకు తొలి సిరిస్ యాషెస్ అయినందుకు క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాషెస్ తొలి టెస్టు కోసం ప్రకటించిన జట్టులో వరల్డ్‌కప్ హీరో జోప్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదు.

ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ చాలా కాలం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక, ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ రాకతో ఆ జట్టు మరింత పటిష్టంగా తయారైంది. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ యాషెస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

యాషెస్‌‌లో తొలి టెస్టు గురించి మీకోసం...

యాషెస్‌‌లో తొలి టెస్టు ఎప్పుడు ప్రారంభమైంది?
ఆగస్టు 1, 2019(గురువారం)

యాషెస్‌‌లో తొలి టెస్టు ఎక్కడ జరుగుతుంది?
ఎడ్జిబాస్టన్, బర్మింగ్ హామ్

భారత కాలమానం ప్రకారం తొలి టెస్టు ఎప్పుడు ప్రారంభమైంది?
మధ్యాహ్నాం 3.30 గంటలకు

యాషెస్ టెస్టు సిరిస్‌ను ఏయే ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి
సోనీ నెట్ వర్క్

యాషెస్ సిరిస్‌ను లైవ్ స్ట్రీమింగ్‌లో చూడాలనుకుంటే!
సోనీ లివ్ (SonyLIV)

Story first published: Thursday, August 1, 2019, 15:32 [IST]
Other articles published on Aug 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+