For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్: ఆర్చర్‌కు నో ప్లేస్, తొలి టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టిదే

Ashes 2019, 1st Test: Englands Playing 11 is Out; Australias Playing 11 Will Be Named At The Toss

హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సమరానికి తెరలేవనుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 1(గురువారం) నుంచి ఎడ్జిబాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఆడనున్న తుది జట్టుని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బుధవారం ప్రకటించాడు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

తొలి టెస్టు కోసం ప్రకటించిన తుది జట్టులో జోప్రా ఆర్చర్, శామ్ కర్రన్, ఒల్లీ స్టోన్‌లకు చోటు దక్కలేదు. మరోవైపు తుది జట్టులో ఉండే 11 మంది జట్టు సభ్యులను టాస్ సమయంలో ప్రకటించనున్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ యాషెస్ సిరిస్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించాడు.

ఇప్పటివరకు జరిగిన అన్ని యాషెస్ సిరిస్‌ల్లో ఆతిథ్య జట్టిదే పైచేయి. చివరగా ఇరు జట్లు తలపడిన యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా 4-0తో గెలిచింది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 70 యాషెస్‌ సిరీస్‌లు జరిగితే.. అందులో 33 సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.

ఇంగ్లాండ్‌ 32 సార్లు విజయం సాధించింది. ఐదు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. ఇక, ఇంగ్లీషు గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్ సిరిస్ నెగ్గి సరిగ్గా 18 ఏళ్లవుతోంది. 2001లో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 4-1తో ట్రోఫీని నెగ్గిన ఆస్ట్రేలియా ఆ తర్వాత ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో యాషెస్ టెస్టు సిరీస్‌ గెలవలేదు.

ఆ తర్వాత 9 యాషెస్‌లు జరగ్గా ఇంగ్లాండ్‌ నాలుగు సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చింది. అందులో సొంతగడ్డపై జరిగిన ఐదు యాషెస్ సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా నాలుగింట విజయం సాధించి ఒకటి దాంట్లో ఓడిపోయింది. అయితే, ఈసారి యాషెస్ కాస్త భిన్నంగా జరుగుతోంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను అభిమానులకు మరింతగా చేరువ చేసేందుకు గాను ఐసీసీ ప్రవేశ పెట్టిన టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఈ సిరీస్‌తోనే మొదలవుతుంది.

ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్ సుమారు రెండు నెలలు(ఏడు వారాలు)పాటు జరగనుంది. తొలి టెస్టు ఆగస్టు 1న ఎడ్జిబాస్టన్ వేదికగా ప్రారంభం కానుండగా... సెప్టెంబర్ 12న ప్రారంభమయ్యే ఆఖరి టెస్టుకు లండన్‌లోని ది ఓవల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. భారత కాలమానం ప్రకారం యాషెస్ సిరిస్ మధ్యాహ్నాం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది.

తొలి టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టు:
రోరీ బర్న్స్, జేసన్ రాయ్, జో రూట్(కెప్టెన్), జోయి డెన్లే, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్

Story first published: Wednesday, July 31, 2019, 19:26 [IST]
Other articles published on Jul 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+