
హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ మరో మైలురాయిని సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 12వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. సిడ్నీ వేదికగా
ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కుక్ 10 పరుగుల్ని చేయడం ద్వారా పన్నెండు వేల టెస్టు పరుగుల్ని సాధించాడు.
దీంతో టెస్టుల్లో 12వేలు లేదా అంతకుపైగా పరుగులు సాధించిన దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (15,921), రికీ పాంటింగ్ (13,378), జాక్వస్ కల్లిస్ (13,289), కుమార సంగక్కర (12,400)ల సరసన అలెస్టర్ కుక్ చోటు దక్కించుకున్నాడు.
ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా 2018 5వ టెస్టు మ్యాచ్ స్కోరు కార్డు
యాషెస్ సిరీస్ భాగంగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కుక్ 244 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాంతో ఒక టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించి చివరకి వరకు నాటౌట్‌గా నిలవడంతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించి ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
తద్వారా 45 ఏళ్ల రికార్డును కుక్ బద్దలు కొట్టాడు. అంతకుముందు 1972లో న్యూజిలాండ్ ఓపెనర్ గ్లెన్ టర్నర్స్ (223 నాటౌట్) ఓపెనర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయగా, ఆపై దాన్ని కుక్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో అధిగమించాడు.
చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 649/7 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ నాలుగో రాజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. జోరూట్ (42), బెయిర్ స్టో (17) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ 210 పరుగుల వెనుకంజలో ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.