
హైదరాబాద్ : యాషెస్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్టులు తలపడుతున్నాయి. ఆస్టేలియా క్రికెటర్ టెస్ట్ మ్యాచ్‌ల్లో తన 22వ సెంచరీని నమోదు చేశాడు. ఆస్ట్రేలియా జట్టుకు ఇంగ్లాండ్ జట్టుకు జరుగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ మళ్లీ తడబడింది. రెండో రోజు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 305/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 98 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించింది. టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. మూడో టెస్ట్ లో భాగంగా మూడో రోజైన శనివారం మెరుగైన స్కోరుతో ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపిస్తుంది.
శనివారం ఈ ఇరు జట్లకు మూడో టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో మొదటగా స్టీవ్ స్మిత్ అతనితో పాటు షాన్ మార్ష్ బ్యాటింగ్ దిగారు. 138 బంతులు ఆడిన స్టీవ్ స్మిత్ తన 22వ సెంచరీని పూర్తి చేశాడు. తక్కువ వ్యవధిలోనే 22వ సెంచరీని పూర్తి చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో స్టీవ్ నిలిచాడు.
మొదటి స్థానంలో డాన్ బ్రాడ్‌మన్ 58 ఇన్నింగ్స్ ఆడి సాధించాడు. రెండో స్థానంలో ఉన్న భారతీయుడు సునీల్ గవాస్కర్ 101 బంతులతో 22వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పడు అదే వరుసలో 108 ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్ 138 బంతుల్లో పూర్తి చేయగలిగాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా స్టీవ్ స్మిత్ కంటే వెనుకే ఉన్నాడు. 22వ సెంచరీని సచిన్ టెండూల్కర్ 114 ఇన్నింగ్స్‌లో సాధించాడు. స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ పై రోహిత్ శర్మ స్పందిస్తూ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో " ఆహా.. ఎంత గొప్ప ఆటగాడో.. ఇంకెంతసేపు క్రీజులో ఉంటాడో" అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.