Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ సారి ఆసీస్ పని అయిపోయినట్టేనా?

Ashes 2017-18: Australia v England fifth Test, day one

హైదరాబాద్: ఆసీస్ విజయానందాన్ని చెడగొడదామనే కసితో సమాయత్తమౌతోంది ఇంగ్లాండ్ జట్టు. ఓవైపు ఇప్పటికే 3-0తో సిరీస్‌ను గెలిచామన్న ధీమాతో ఉన్న ఆస్ట్రేలియా మునుపటి తీరునే ప్రదర్శిస్తామని జబ్బలు చరుస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ఇరుజట్ల మధ్య ఆఖరిదైన యాషెస్ ఐదో టెస్టుకు రంగం సిద్ధమైంది.

కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఆసీస్ ఆధిక్యం తగ్గించడంతో పాటు ఇప్పటికే చేజారిన పరువును కొంతైనా కాపాడుకోవాలని ఇంగ్లీష్ ఆటగాళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. సీనియర్ ఆటగాడు కుక్ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. అయితే పక్కటెముకల గాయంతో సీమర్ క్రిస్ వోక్స్ ఈ మ్యాచ్‌కు దూరంకావడం ప్రతికూలంగా మారింది.

వోక్స్ స్థానంలో లెగ్ స్పిన్నర్ మాసన్ క్రేన్ ఐదు రోజుల ఫార్మాట్‌లో అరంగేట్రం చేయనున్నాడు. దీంతో ఆల్‌రౌండర్ మొయిన్ అలీపై వేటు పడే అవకాశాలు తగ్గాయి. కెప్టెన్ రూట్ ఫర్వాలేదనిపిస్తున్నా.. స్టోన్‌మన్, విన్సీ, మాలన్, బెయిర్‌స్టోలకు ఇది చివరి పరీక్షగా మారింది. ఇక బౌలింగ్‌లో బ్రాడ్ అంచనాలను అందుకుంటున్నాడు. కానీ, అండర్సన్ మాత్రం విఫలమవుతున్నాడు. కీలకమైన వన్డే సిరీస్‌కు ముందు అతను గాడిలో పడటం చాలా అత్యవసరం. కుర్రాన్, మాలన్ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. నాలుగో టెస్టును డ్రాతో ముగించడం ఇంగ్లండ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది.

గాయం నుంచి కోలుకున్న స్టార్క్..
ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్ విజయంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఆధిక్యాన్ని 4-0కు పెంచుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ గాయం నుంచి కోలుకున్నాడు. అతను ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని కెప్టెన్ స్మిత్ ముందే తెలిపాడు.

దీంతో పాపం స్పిన్నర్ అగర్ రిజర్వ్ బెంచ్‌కు పరిమితంకానున్నాడు. స్మిత్ సూపర్ ఫామ్‌కు తోడు వార్నర్, మార్ష్ సోదరుల చెలరేగడం ఆసీస్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. బౌలింగ్‌లో స్టార్క్‌కు తోడుగా కమిన్స్, హాజెల్‌వుడ్‌లను బరిలోకి దించాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. లియోన్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు.

మ్యాక్స్‌వెల్, వేడ్‌పై వేటు
సిడ్నీ: ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు ఆసీస్ జట్టును బుధవారం ఎంపిక చేశారు. మ్యాక్స్‌వెల్, మాథ్యూ వేడ్‌లపై వేటు వేసి, టీ20 స్పెషలిస్ట్ క్రిస్‌లిన్, వికెట్ కీపర్ టిమ్ పైనీకి అవకాశం కల్పించారు. స్టార్క్, హాజెల్‌వుడ్, కమిన్స్‌ల పేస్ త్రయాన్ని కొనసాగించారు.

ఆస్ట్రేలియా జట్టు వివరాలు: స్మిత్ (కెప్టెన్), వార్నర్, కమిన్స్, ఫించ్, హాజెల్‌వుడ్, హెడ్, క్రిస్‌లిన్, మిచెల్ మార్ష్, టిమ్ పైనీ, రిచర్డ్‌సన్, స్టార్క్, స్టోయినిస్, టై, జంపా.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 4, 2018, 9:52 [IST]
Other articles published on Jan 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+