For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2021: సంతాప సూచకంగా నల్లరంగు బ్యాండ్స్ ధరించి తొలి టెస్ట్ ఆడిన ఇంగ్లాండ్ ప్లేయర్లు

Ashes 1st test 2021 at Gabba: Why England Players Are Wearing Black Armbands, reason is here

బ్రిస్బేన్: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగే యాషెస్ టెస్ట్ సిరీస్ ఆరంభమైంది. ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మొదలైంది. అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఇది. జనవరి 18వ తేదీన ముగుస్తుంది. ఈ దఫా ఆస్ట్రేలియా ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చింది. 2019లో యాషెస్ సిరీస్‌ను డ్రా ముగిసింది. ప్రస్తుతం యాషెస్ కప్ కంగారూల ఆధీనంలో ఉంది. దాన్ని తిరిగి తెచ్చుకోవాలనే పట్టుదలతో ఆసీస్ గడ్డపై అడుగు పెట్టింది ఇంగ్లాండ్.

తొలి టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా జట్టు కుప్పకూలింది. 147 పరుగులకే చాప చుట్టేసింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల ధాటికి ఏ మాత్రం ఎదురొడ్డి నిలవలేకపోయింది. 11 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. 29 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడింది. ఆ తరువాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది ఇంగ్లాండ్ ఇన్నింగ్. మిడిలార్డర్ బ్యాటర్లు ఒల్లీ పోప్, వికెట్ కీపర్ జోస్ బట్లర్ మాత్రమే కొంత వరకు ప్రతిఘటించగలిగారు. వారిద్దరి మధ్య ఏర్పడిన భాగస్వామ్యమే టాప్.

ఒల్లీ పోప్-35, జోస్ బట్లర్-39 పరుగులు చేశారు. ఓపెనర్ హసీబ్ హమీద్-25, లోయర్ ఆర్డర్ బ్యాటర్ క్రిస్ వోక్స్ 21 పరుగులతో ఫర్వాలేదనిపించుకున్నారు. మరెవరూ డబుల్ ఫిగర్‌ను కూడా అందుకోలేకపోయారు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు మూకుమ్మడిగా దండయాత్ర చేయడంతో ఇంగ్లీష్ బ్యాటర్లు ఏ మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. ఒకరి తరువాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వర్షం వల్ల ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్‌ను ఆరంభించలేదు. చివరి రెండు సెషన్ల ఆట తుడిచి పెట్టుకుని పోయింది.

తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ చేతులకు నల్లరంగు బ్యాండ్స్‌ను ధరించడం కనిపించింది. బ్యాటర్లందరూ బ్యాండ్స్ ధరించే క్రీజ్‌లోకి దిగారు. వారు ఎందుకు ఈ బ్యాండ్స్ ధరించారనేది మొదట్లో తెలియరాలేదు. ఆ తరువాత ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు.. దీన్ని బయట పెట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వృద్ధురాలు, 110 సంవత్సరాల ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ ఎలీన్ యాష్‌ ఇటీవలే కన్నుమూశారు. ఆమె మృతికి సంతాప సూచకంగా ఇంగ్లాండ్ ప్లేయర్లు నల్లరంగు బ్యాండ్ ధరించారు.

ఇంగ్లండ్ తరపున ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడారు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌. 1937లో ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేశారామె. ఏడు టెస్ట్ మ్యాచ్‌లను ఆడారు. 1949లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఆ తరువాత రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కోసం తన సేవలను అందించారు. ఆమె మరణానికి సంతాప సూచకంగా ఇంగ్లాండ్ ప్లేయర్లు నల్లరంగు బ్యాండ్‌ను ధరించినట్లు జర్నలిస్ట్, స్పోర్ట్స్ కామెంటేటర్ అలీసన్ మిఛెల్ ధృవీకరించారు.

Story first published: Wednesday, December 8, 2021, 19:25 [IST]
Other articles published on Dec 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+