For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌కు గుడ్‌బై: ఏడుగురు బాలీవుడ్ హీరోయిన్లతో యువరాజ్ లవ్ ఎఫైర్

 As Yuvraj Singh Announces Retirement, a Look At His Alleged Love Affairs With 7 Bollywood Actresses

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి తన 19 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ధోని నాయకత్వంలో టీమిండియా సాధించిన రెండు వరల్డ్‌కప్‌ల్లోనూ యువీ కీలకపాత్ర పోషించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భారత్ తరుపున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల్లో 304 మ్యాచ్‌లాడి 14 సెంచరీలు, 52 హాఫ్‌ సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. 58 టీ20 మ్యాచ్‌లాడిన యువీ 8 ఆఫ్‌ సెంచరీలతో 1177 పరుగులు చేశాడు.

సొంతగడ్డపై 2011లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శన చేసి 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డు అందుకున్నాడు. యువరాజ్ క్రికెట్ కెరీర్ కొంత ఆసక్తికరంగా ఉంటుంది. తాను టీమిండియాకు ఆడే రోజుల్లో మొత్తం ఏడుగురు బాలీవుడ్ హీరోయిన్లతో లవ్ ఎపైర్లు పెట్టుకున్నాడు. అవేంటో ఒక్కసారి చూద్దాం..

కిమ్ శర్మ

కిమ్ శర్మ

కిమ్ శర్మ... కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో హీరోయిన్‌గా నటించింది. యువరాజ్ సింగ్ తన కెరీర్ తొలినాళ్లలో కిమ్ శర్మతో ప్రేమాయణం నడిపాడు. సుమారు నాలుగేళ్ల పాటు కిమ్ శర్మతో డేటింగ్ చేసిన అనంతరం 2007లో ఇద్దరూ విడిపోయారు.

ప్రీతి జంగాని

ప్రీతి జంగాని

కిమ్ శర్మతో బ్రేకప్ అయిన తర్వాత యువరాజ్ సింగ్ బాలీవుడ్ నటి ప్రీతి జంగానీతో ప్రేమాయణం నడిపాడు. ప్రీతి జంగానీ కూడా పలు తెలుగు సినిమాల్లో నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలో ఈమెనే హీరోయిన్. అయితే, ఈమెతో యువీ ఎక్కువ కాలం డేటింగ్ చేయలేదు.

ప్రీతి జింటా

ప్రీతి జింటా

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహా యజమానిగా ఉన్న ప్రీతి జింటాతో యువరాజ్ డేటింగ్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రీతిజింటాని యువరాజ్ హగ్ చేసుకున్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

దీపికా పదుకొణె

దీపికా పదుకొణె

యువరాజ్ సింగ్ ఎక్కువ కాలం డేటింగ్ చేసిన బాలీవుడ్ నటి ఎవరైనా ఉన్నారంటే ఆమె దీపికా పదుకొణెనే. టీ20 వరల్డ్‌కప్ 2007లో యువీ అద్భుత ప్రదర్శన అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత యువరాజ్ మ్యాచ్‌లు ఆడే సందర్భంలో దీపికా అతడికి మద్దతుగా స్టేడియానికి వచ్చి ఛీరింగ్ చెప్పడంతో పాటు ఒకానొక సమయంలో అతడి పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించింది.

రియా సేన్

రియా సేన్

బెంగాలీ బ్యూటీ రియా సేన్‌తో కూడా యువరాజ్‌కు లవ్ ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీపికా పదుకొణెతో బ్రేకప్ అయిన తర్వాత ఓ పార్టీలో రియా సేన్‌ను కలవడం ఆ తర్వాత వీరిద్దరూ డేటింగ్‌లో మునిగిపోయారు. వీరిద్దరూ ఒకరి చేతులను మరొకరు పట్టుకున్న ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

మనీషా లాంబ

మనీషా లాంబ

2011లో మనీషా లాంబను యువరాజ్ సింగ్ ముద్దు పెట్టుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఆ తర్వాత మనీషా లాంబ ఆ వార్తలను ఖండించారు. ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని, తన పోలికలతో ఉన్న మరో అమ్మాయి అని వెల్లడించింది.

నేహా ధూపియా

నేహా ధూపియా

2014లో యువరాజ్ సింగ్, నేహా ధూపియా ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. సోఫియా చౌదరి పుట్టినరోజు వేడుకలకు వీరిద్దరూ కలిసి రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఆ తర్వాత ఈ వార్తలను నేహా ధూపియా ఖండించారు.

Story first published: Monday, June 10, 2019, 16:33 [IST]
Other articles published on Jun 10, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+