For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టులు ఓకే: తొలి వన్డే ఎంతో కీలకమన్న రహానే

By Nageshwara Rao

ధర్మశాల: న్యూజిలాండ్‌తో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరిస్‌లో దూకుడుగా ఆడతామని టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజ్యంకె రహానే తెలిపాడు. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా రహానేను బీసీసీఐ వైస్ కెప్టెన్‌గా నియమించింది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో రహానే కీలక పాత్ర పోషిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌లో రహానే దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల టెస్టు సిరిస్‌లో రహానే 347 పరుగులు చేయగా, అత్యధికంగా ఛటేశ్వర పూజారా 373 పరుగులు చేశాడు. తొలి వన్డే ప్రారంభానికి ముందు రహానే మీడియాతో మాట్లాడాడు.

As vice-captain I need to be 'alert' all the time: Ajinkya Rahane

ఆటలో భాగంగా కొత్త బాధ్యతలను అప్పగించినప్పుడు అలర్ట్‌గా ఉండాలని తెలిపాడు. టెస్టులో సిరిస్‌లో ప్రదర్శించిన దూకుడునే వన్డే సిరిస్‌లో కూడా కొనసాగిస్తామని అన్నాడు. ఆటలో తాను సీనియారిటీని లేదా జూనియారిటీని పెద్దగా పట్టించుకోనని తెలిపాడు. టెస్టులో మాదిరి వన్డేల్లో కూడా దూకుడుగా ఆడాలనే ప్రణాళికతో బరిలోకి దిగామని చెప్పాడు.

వన్డేల్లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటామన్నాడు. వన్డేల్లో ప్రత్యర్ధి ఆటగాళ్ల బలాబలాల కంటే, మా బలం మీద ఆధారపడతామని చెప్పాడు. టెస్టు సిరీస్‌లో గెలిచినప్పటికీ, వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలవడం ఎంతో ముఖ్యమని రహానె అభిప్రాయపడ్డాడు.

ఆదివారం ప్రారంభం కానున్న వన్డే సిరిస్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. టెస్టు సిరీస్‌ నెగ్గినా, వన్డేల్లో గెలవాలని తెలిపాడు. తొలి వన్డేనే ఎంతో ముఖ్యమని చెప్పాడు. తొలి మ్యాచ్‌ గెలిస్తే ఎంతో ఉత్సాహంగా ఉంటుందని తెలిపాడు. అతి తక్కువ టైంలో ఒక ఫార్మాట్‌ నుంచి మరో ఫార్మాట్‌కు మారడం క్రికెటర్లకు మామూలేనని పేర్కొన్నాడు.

ఇందుకు మానసికంగా సిద్ధం కావాలని తెలిపాడు. ఇక సెలక్టర్లు కొత్త ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలిస్తుండటం శుభ పరిణామమని రహానే పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల 16న (ఆదివారం) ధర్మశాలలో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు ధర్మశాలకు చేరుకున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+