T20 World Cup 2022: శనివారం నుంచి టీ20 వరల్డ్ కప్ సూపర్-12 .. ఆ మ్యాచ్‍లకు వర్షం ముప్పు..

ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ICC T20 ప్రపంచ కప్ 2022 అక్టోబర్ 16న ప్రారంభమైంది. ప్రస్తుతం గ్రూప్ మ్యాచ్ లు జరుగుతుండగా.. శనివారం నుంచి సూపర్ -12 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. సూపర్-12 ప్రారంభ మ్యాచ్ అతిథ్య జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగునుంది. ఈ నెల 22న ఈ మ్యాచ్ జరగనుండగా.. 23న భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఇండియా, న్యూజిలాండ్
అయితే ఈ టీ20 వరల్డ్ కప్ కు వర్షం ఆటంక కలిగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియా, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. శనివారం జరగనున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ కు వాన అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కే కాదు ఆ తర్వాత రోజు జరిగే భారత్, పాక్ మ్యాచ్ కు కూడా వర్షం అడ్డుతగిలే అవకాశం లేకపోలేదు.

సిడ్నీ
అక్టోబర్ 22న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. గతేడాది ICC T20 వరల్డ్ 2021 ఫైనల్‌లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ను ఓడించి పొట్టి ఫార్మాట్‌లో వారి మొట్టమొదటి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయింది. ఇప్పుడు ఈ మ్యాచ్ లోగెలిచి వరల్డ్ కప్ బోణి కొట్టాలని చూస్తోంది. అయితే సిడ్నీలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పెర్కొంది. బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ 1 నుంచి 3 మిమీ వర్షంతో 80% వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

మెల్‌బోర్న్
మెల్‌బోర్న్‌లోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం అక్టోబర్ 23న భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. గత నెల ఆసియా కప్ తర్వాత రెండు జట్ల రెండు సార్లు తలపడగా.. చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి. అయితే సిడ్నీలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
"చాలా ఎక్కువ (90%) జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది" అని స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది.

10 నుంచి 25 మిల్లీమీటర్ల వర్షం
మెల్‌బోర్న్‌లో ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో భారత్ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ రోజు 90% వర్షం కురిసే అవకాశం ఉందట. 10 నుంచి 25 మిల్లీమీటర్ల మధ్య వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ చెబుతోంది. బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ సెప్టెంబర్‌లో ఈ సంవత్సరం లా నియా ఈవెంట్ వేసవి అంతా ఉండకపోవచ్చని పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications