Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోచ్‌ పదవిపై మోజు, చాపెల్ రాకతో జరిగిన మార్పులపై ఇండియా టుడే కాంక్లేవ్‌లో గంగూలీ

హైదరాబాద్: భారత క్రికెట్‌లో ఒకానొక సమయంలో ప్రపంచం తన పాదాల కింద ఉన్నట్లు అనిపించిందని... అయితే గ్రెగ్ చాపెల్‌ రాకతో ఆ తర్వాత అంతా మారిపోయిందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. శుక్రవారం 'ఇండియా టుడే కాంక్లేవ్‌ ఈస్ట్‌-2017'లో గంగూలీ పాల్గొన్న తన క్రికెట్‌కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు.

 భారత క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా మారాలని అనుకున్నా

భారత క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా మారాలని అనుకున్నా

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తాను భారత క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా మారాలని ఎంతో కోరుకున్నానని, అయితే విధి తనను పరిపాలనా వ్యవహారాల వైపు తీసుకెళ్లిందని గంగూలీ ఈ సందర్భంగా వెల్లడించాడు. 'మనం ఏం చేయగలమో దాని గురించే ఆలోచించాలి. జీవితం మనల్ని ఎటువైపు తీసుకెళుతుందో ఎవరూ చెప్పలేరు' అని గంగూలీ అన్నాడు.

 అప్పుడు వైస్ కెప్టెన్‌ను కూడా కాను

అప్పుడు వైస్ కెప్టెన్‌ను కూడా కాను

'1999లో నేను సచిన్‌ నాయకత్వంలో ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు కనీసం వైస్‌ కెప్టెన్‌ను కూడా కాదు. అప్పుడు సచిన్‌ కెప్టెన్‌. కానీ మూడు నెలల తర్వాత నేను జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఆటనుంచి తప్పుకున్నాక భారత జట్టు కోచ్‌ కావాలని గట్టిగా అనుకున్నాను. కానీ దాల్మియా పిలిచి ఆరు నెలలో క్యాబ్‌లో ఉండమన్నాడు' అని దాదా తెలిపాడు.

 దాల్మియా మరణంతో క్యాబ్ అధ్యక్ష బాధ్యతలు

దాల్మియా మరణంతో క్యాబ్ అధ్యక్ష బాధ్యతలు

'అయితే దాల్మియా మరణంతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఎవరూ లేరు. దీంతో నేను ఆ పదవి చేపట్టా. మామూలుగా ఓ కొత్త వ్యక్తి క్యాబ్‌ అధ్యక్షుడు కావడానికి 20 ఏళ్లు పడుతుంది' అని గంగూలీ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు.

 చాపెల్‌ రాకతో ఆ తర్వాత అంతా మారిపోయింది

చాపెల్‌ రాకతో ఆ తర్వాత అంతా మారిపోయింది

అంతేకాదు 1995-2006 మధ్య కాలంలో తన కెరీర్‌ అద్భుతంగా సాగిందని, ప్రపంచం తన పాదాల కింద ఉన్నట్లు అనిపించిందని, అయితే గ్రెగ్ చాపెల్‌ రాకతో ఆ తర్వాత అంతా మారిపోయిందని గంగూలీ తెలిపాడు. వ్యక్తిగతంగా తాను కూడా నెమ్మదైన స్వభావం ఉన్నవాడినే అయినా కెప్టెనయ్యాక జట్టు కోసం కఠినంగా మారాల్సి వచ్చిందని చెప్పాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, November 25, 2017, 10:57 [IST]
Other articles published on Nov 25, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+