Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాండ్యా నుంచి ఎక్కువగా ఆశిస్తున్నారు: కపిల్‌దేవ్

As his primary skill, Pandya needs to improve his batting: Kapil Dev

హైదరాబాద్: ప్రస్తుత టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుపడాలని మాజీ ఆల్‌రౌండర్, భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ సూచించారు. అతను మంచి ఆటగాడే కానీ, అతని నుంచి ఎక్కువగా ఆశిస్తుండటంతో ఒత్తిడి పెరిగి ఆడలేకపోతున్నాడు.

ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా పర్యటనలో మొదటి ఇన్నింగ్స్ ఆడి 93 పరుగులు చేసిన పాండ్యా మరే ఇన్నింగ్స్ లోనూ అంతగా రాణించలేకపోయిన విషయాన్ని గుర్తు చేశాడు.

బ్యాటింగ్‌పై దృష్టి మరింతగా:

బ్యాటింగ్‌పై దృష్టి మరింతగా:

‘పాండ్యాలో ప్రతిభ, సామర్థ్యాలకు కొదవలేదు. కొన్ని మ్యాచ్‌ల్లో వాటిని చూపించాడు కూడా. వేరొకరితో పోల్చినపుడు అతడిపై ఒత్తిడి పెరుగుతుందనే మాట నిజమే. దానికి బదులు అతడు సహజ సిద్ధమైన ఆట ఆడితే బాగుంటుంది. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి మరింత మెరుగుపడితే మంచిది' అని సూచించాడు.

బ్యాటింగ్, బౌలింగ్ ఏదైనా ఒక్కటి:

బ్యాటింగ్, బౌలింగ్ ఏదైనా ఒక్కటి:

ఆల్‌రౌండర్లు కూడా రెండింటిలో ఏదైనా ఒక విభాగంలో అత్యుత్తమంగా ఉండాల్సిందే ఎందుకంటే నా దృష్టిలో పాండ్యా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. నేను అతడిని అలాగే చూడాలనుకుంటున్నా.' అని అన్నారు.

పాండ్యా నుంచి ఎక్కువ ఆశిస్తున్నామా:

పాండ్యా నుంచి ఎక్కువ ఆశిస్తున్నామా:

‘మనం అతడి నుంచి ఎక్కువగా ఆశిస్తు న్న మాట వాస్తవమే... కానీ ఆ సామర్థ్యం పాండ్యాలో ఉంది. ప్రస్తుత జట్టులో అతడో ఉత్తమ ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు' అని అన్నారు.

భారత జట్టు విజయావకాశాలు:

భారత జట్టు విజయావకాశాలు:

మరో వైపు 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజయావకాశాల గురించి మాట్లాడుతూ...‘కోహ్లి దూకు డు, ధోని ప్రశాంతత కలగలిస్తే మన జట్టుకు మంచి చాన్స్‌ ఉంటుంది' అని కపిల్‌ అభిప్రాయపడ్డారు.

Story first published: Friday, March 2, 2018, 8:25 [IST]
Other articles published on Mar 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+