Hardik Pandya Sensational Bowling: 4ఓవర్లు, 3మెయిడిన్లు, 2వికెట్లు, 2రన్స్.. ట్విట్టర్లో ట్రెండింగ్

ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఓల్డ్ ట్రాఫార్డ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే సిరాజ్ షాకిచ్చాడు. రెండో ఓవర్లో తన తొలి స్పెల్ అందుకున్న సిరాజ్ జానీ బెయిర్ స్టో (0), జో రూట్ (0)లను డకౌట్ చేశాడు. వీరిద్దరూ ఔటయినప్పటికీ.. బెన్ స్టోక్స్ (27పరుగులు 29బంతుల్లో 4ఫోర్లు), జాసన్ రాయ్ (41పరుగులు 31బంతుల్లో 7ఫోర్లు) అడపాదడపా ఫోర్లు కొడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఇక ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరిని హార్దిక్ పాండ్యా అత్యద్భుతంగా బౌలింగ్ చేసి ఔట్ చేశాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంత్ బౌలింగ్‌తో హార్దిక్ ఆకట్టుకున్నాడు. అతను తన తొలి స్పెల్ 4ఓవర్లలో 3మెయిడెన్లు వేసి 2వికెట్లు పడగొట్టాడు.
జాసన్ రాయ్‌ను ఊరించి
హార్దిక్ పాండ్యా ప్రతాపానికి 74పరుగులకే 4వికెట్లు కోల్పోయింది. ఇక 10వ ఓవర్లో తన తొలి స్పెల్ బౌలింగ్ అందుకున్న హార్దిక్ అత్యద్భుతమైన షార్ట్ పిచ్ బంతులు వేస్తూ జాసన్ రాయ్‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. అయిదో బంతికి హిప్ హైట్‌లో వేయగా రాయ్ ఫ్లిక్ చేశాడు. ఆ బంతి అమాంతం గాల్లోకి లేచింది. దీంతో కీపర్ రిషబ్ పంత్ చక్కని క్యాచ్ అందుకోవడం రాయ్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ ఓవర్ మెయిడిన్ ప్లస్ వికెట్ వచ్చింది.
స్టోక్స్‌ను బురిడీ కొట్టించి
తర్వాత 12వ ఓవర్లో 2పరుగులు ఇచ్చిన హార్దిక్.. 14వ ఓవర్లో మరోసారి తన మార్క్ చూపించాడు. క్రీజులో ఉన్న స్టోక్స్ ముందుకు రాగా.. షార్ట్ పిచ్ బంతి వేయగా అది బ్యాట్‌కు తాకి గాల్లోకి లేచింది. ఇక బౌలింగ్ ఎండ్ నుంచి వేగంగా పరిగెత్తి హార్దిక్ క్యాచ్ అందుకున్నాడు. ఆ ఓవర్ కూడా మెయిడిన్ అయింది. ఇక 16వ ఓవర్ కూడా మొయిన్ అలీ.. హార్దిక్‌ను ఎదుర్కొలేకపోయాడు. దీంతో ఆ ఓవర్ కూడా మెయిడిన్ అయింది. తొలి స్పెల్లో అతని ప్రదర్శన 4-3-2-2గా నమోదైంది.
ట్విట్టరులో ట్రెండింగ్
ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్ ప్రదర్శనకు ట్విట్టర్లో పోస్టులు, కామెంట్లు వెల్లువెత్తాయి. హార్దిక్ అద్భుత స్పెల్ అంటూ కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. హార్దిక్ పాండ్యా ఎకానమీ 0.50గా నమోదు కావడం అద్భుతం అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇక ఇంగ్లాండ్‌లో హార్దిక్ ఇప్పటివరకు 40వికెట్లు పడగొట్టాడు. అత్యధికంగా వికెట్లు తీసింది ఇంగ్లాండ్‌లోనే. ఆ తర్వాత ఇండియాలో అతను 39వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ ప్రస్తుతం 35ఓవర్లకు 5వికెట్లు కోల్పోయి 190పరుగులు చేసింది. క్రీజులో బట్లర్ (59పరుగులు 75బంతుల్లో 3ఫోర్లు 2సిక్సర్లు), లివింగ్ స్టోన్ (20పరుగులు 26బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) ఉన్నారు. ఇక మొయిన్ అలీ (34పరుగులు 44బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు)ను రవీంద్రా జడేజా ఔట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications