Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీని చూసి అందరూ భయపడుతుండొచ్చు

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో భయపెట్టేలా కనిపించొచ్చంటూ దక్షిణాఫ్రికా మాజీ కోచ్‌ రే జెన్నింగ్స్‌ అన్నారు. కోహ్లీ పూర్తి శక్తిని ఆటలో ఉపయోగించేలా ఓ మంచి మార్గదర్శి అతని తోడుండాలంటూ అభిప్రాయపడ్డాడు. అండర్‌-19 నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ వరకు కోహ్లీకి కోచ్‌గా జెన్నింగ్స్ వ్యవహరించాడు.

కెప్టెన్‌గా పరిణతి రావాల్సి ఉంది:

కెప్టెన్‌గా పరిణతి రావాల్సి ఉంది:

‘ఒక కెప్టెన్‌గా అతనింకా అత్యుత్తమంగా లేడు. భారత్‌ క్రికెట్‌ వ్యవస్థ కోహ్లీకి సూచనలు ఇవ్వాలి. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కోహ్లీ వరకు భారత జట్టులో చాలా మార్పులొచ్చాయి. ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటే విరాట్‌ అందుకు భిన్నం.' అని పేర్కొన్నాడు.

మంచి మార్గదర్శి ఉండాలి:

మంచి మార్గదర్శి ఉండాలి:

'ఒకానొక సందర్భంలో అతనికి సూచనలిచ్చేందుకు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సహచరులు భయపడే ప్రమాదం ఉంది. అతని తీరును చూసి జట్టులోని యువ ఆటగాళ్లు భయపడే ఛాన్సుంది. తనని ప్రశాంతంగా ఉంచే మార్గదర్శి ఉంటే బాగుంటుంది' అని అన్నారు జెన్నింగ్స్‌.

వయస్సుకు మించిన నైపుణ్యం:

వయస్సుకు మించిన నైపుణ్యం:

ఇది మినహాయిస్తే కోహ్లీ చాలా తెలివైనవాడు. ఆట పట్ల అభిరుచి ఎక్కువ. అత్యుత్తమంగా ఉండాలనుకుంటాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లకు ఉండే నైపుణ్యాలన్నీ అతనిలో ఉన్నాయి. అండర్ 19 జట్టులో ఉన్నప్పుడే ఆ వయస్సు వాళ్ల కంటే ఎక్కువ నైపుణ్యాలు అతనిలో ఉండేవి' అని ప్రశంసించారు.

 33 వన్డే సెంచరీలు:

33 వన్డే సెంచరీలు:

ఇంకా మాట్లాడుతూ.. చాలా చిన్న వయసులోనే కోహ్లీ రికార్డులు తిరగరాస్తున్నాడని కొనియాడారు. ‘ఇప్పటికే అతడి ఖాతాలో 33 వన్డే శతకాలున్నాయి. సచిన్‌ను అందుకోగల దూరంలోనే ఉన్నాడు. ఇదే జోరుతో మరో పదేళ్ల వరకు క్రికెట్‌ ఆడగలడు. రెండు మూడేళ్లలో ఇంకా పరిణతి సాధిస్తాడు.' అని ధీమా వ్యక్తం చేశాడు.

 ప్రపంచంలోని ఇద్దరు ఆటగాళ్లలో ఒకడు:

ప్రపంచంలోని ఇద్దరు ఆటగాళ్లలో ఒకడు:

'2008 అండర్‌-19 ప్రపంచకప్‌ సమయంలోనే ప్రత్యర్థి జట్టు కోచ్‌గా కోహ్లీని గమనించాను. అతడు బ్రాడ్‌మన్‌ కన్నా గొప్పవాడో కాడో చెప్పలేను. కానీ, ప్రపంచంలోని ఈ తరం ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లలో కచ్చితంగా ఉంటాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో స్వదేశీ జట్టు సభ్యులకన్నా కోహ్లీనే ఎక్కువ పరుగులు చేశాడు. వన్డే సిరీస్‌లో సఫారీలు పుంజుకోవడం ఇక కష్టమే. నా దృష్టిలో ఇప్పటికే వారు సిరీస్‌ చేజార్చుకున్నారు' అని జెన్నింగ్స్‌ వెల్లడించారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 6, 2018, 11:11 [IST]
Other articles published on Feb 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+