ఆఖరి బంతికి హైదరాబాదీ అమ్మాయి అదరహో.. ముంబయి ఇండియన్స్‌కు పడింది దెబ్బ!
డబ్ల్యూపీఎల్ 2025లో సంచలన విజయం నమోదైంది. ఓటమి ఖాయమనుకున్న థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఆఖరి బంతికి రెండు పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ పై విజయాన్ని సాధించింది దిల్లీ క్యాపిటల్స్. ఈ విజయంలో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి కీలక పాత్ర పోషించడం విశేషం.
మ్యాచ్ సాగిందిలా..
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ క దిగిన ముంబయి జట్టు 19.1 ఓవర్లలో 164 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ముంబయి బ్యాటర్లలో నాట్ సీవర్ (59 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 80*) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 42 పరుగులు) మంచి ఇన్నింగ్స్ ఆడింది. యాస్తికా భాటియా (11), అమేలియా కెర్ (9), అమన్‌జోత్ కౌర్ (7) నామమాత్రపు పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 3 వికెట్లు పడగొట్టగా.. శిఖా పాండే 2 వికెట్లు తీసింది. క్యాప్సే, మిన్ను మణి తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ టీమ్.. 8 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో ఛేదించింది. ఇన్నింగ్స్ లాస్ట్ బాల్ కు విజయానికి రెండు పరుగుల అవసరమవ్వగా.. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీస్తుందేమో అనిపించింది. ఆ సమయంలో హైదరాబాదీ అమ్మాయి అరుంధతి రెడ్డి (2*) జట్టుకు విజయాన్ని అందించింది. ఓపెనర్ షఫాలీ వర్మ (18 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 43 పరుగులు) రాణించింది. నిక్కీ ప్రసాద్ (32 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 35 పరుగులు) దూకుడు ప్రదర్శన చేసింది. సారా బ్రైస్ (21), క్యాప్సే (16), మెగ్ లానింగ్ (15), అన్నాబెల్ సదర్లాండ్ (13), రాధా యాదవ్ (9*) పర్వాలేదనిపించారు. ముంబయి బౌలర్లలో హేలీ మాథ్యూస్ , అమేలియా కెర్ తలో రెండు వికెట్లు తీయగా.. నాట్ సీవర్, షబ్నిమ్, సజన చెరో వికెట్ దక్కించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications