న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ సైతం!: ఆంటిగ్వా టెస్టులో నలుపు రంగు బ్యాడ్జిలతో టీమిండియా

Arun Jaitley passes away: Indian team to wear black armband in Antigua Test

హైదరాబాద్: ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు శనివారం నలుపు రంగు బ్యాడ్జిలను ధరించి బరిలోకి దిగనున్నారు. మాజీ కేంద్ర మంత్రి, మాజీ బీసీసీఐ ఉపాధ్యక్షుడు అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూసిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 66 ఏళ్లు. ఆయనకు ఒక భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు. గ‌త రెండు వారాలుగా ఎయిమ్స్ డాక్ట‌ర్లు ఆయన్ను వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

<strong>స్వర్ణానికి అడుగు దూరంలో: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో పీవీ సింధు</strong>స్వర్ణానికి అడుగు దూరంలో: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో పీవీ సింధు

శనివారం మధ్యాహ్నాం 12.07 నిమిషాలకు

ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో శనివారం మధ్యాహ్నాం 12.07 నిమిషాలకు ఆయన క‌న్నుమూసిన‌ట్లు ఎయిమ్స్ డాక్టర్లు ప్రకటించారు. అరుణ్ జైట్లీ కన్నుమూసిన నేపథ్యంలో బీసీసీఐ ట్రెజరర్ అనిరుథ్ చౌదరి ఆయన మృతికి సంతాప సూచికగా ఆటగాళ్లు నలుపు రంగు బ్యాడ్జిలను ధరించాలని సూచించారు.

సీఓఏ సైతం అంగీకారం

ఈ ఐడియాకు బీసీసీఐ పాలకుల కమిటీతోపాటు సీఈఓ రాహుల్ జోహ్రీ సైతం అంగీకరించారు. కాగా, అరుణ్ జైట్లీ మరణంపై యావత్ భారత్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్‌కు సేవలందించారు.

బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా

బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా

కొన్నేళ్లుగా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. ముఖ్యంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతోమంది యువ క్రికెటర్లను ప్రొత్సహించారు. ఇక, ఢిల్లీ క్రికెట్‌ అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో కీలకంగా వ్యవహారించారు.

సోషల్ మీడియాలో సంతాపం

అరుణ్ జైట్లీ మృతి నేపథ్యంలో తాజా, మాజీ క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా ఆరుణ్‌ జైట్లీతో తమకున్న జ్ఞాపకాలను సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలిపారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా సెహ్వాగ్ తన ట్విట్టర్‌‌లో ట్వీట్ చేశారు.

సెహ్వాగ్ ఇలా

"అరుణ్‌ జైట్లీ మరణం వ్యక్తిగతంగా నన్ను ఎంతో బాధించింది. ఆయనతో నాకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. ఎప్పుడు కలిసినా ప్రేమగా పలకరించేవారు. ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే నాతో సహా ఎంతో మంది ఢిల్లీ ఆటగాళ్లు దేశానికి ఆడారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో, ఆటగాళ్ల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండే వారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి" అని ట్వీట్‌ చేశారు.

Story first published: Saturday, August 24, 2019, 17:35 [IST]
Other articles published on Aug 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X