న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ చైర్మన్‌ రేసులో గంగూలీ లేడు.. కానీ..: అరుణ్‌ ధుమాల్‌

Arun Dhumal says Sourav Ganguly will not contest for ICC chairman post

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ పదవి రేసులో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఉన్నట్లు వచ్చిన వార్తలను బీసీసీఐ బోర్డు ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ ఖండించారు. ఐసీసీ చైర్మన్‌ పదవి కోసం దాదా పోటీ చేయడం లేదని తాజాగా ఆయన స్పష్టం చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండి ఐసీసీ చైర్మన్‌ పదవి కోసం పోటీపడటం నిబంధలకు విరుద్ధమని ఇప్పటికే మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా పేర్కొన్నారు. దీంతో అరుణ్‌ ధుమాల్‌ వివరణ ఇచ్చారు.

పోర్న్ వీడియోలు పెడుతారా.. ఇక సోషల్ మీడియా వైపు కన్నెత్తి చూడను: మాజీ దిగ్గజంపోర్న్ వీడియోలు పెడుతారా.. ఇక సోషల్ మీడియా వైపు కన్నెత్తి చూడను: మాజీ దిగ్గజం

'ఐసీసీ చైర్మన్‌ రేసులో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ లేడు. ఇప్పటివరకు వచ్చినవన్నీ రూమర్లు మాత్రమే. ఐసీసీ అధ్యక్ష రేసులో బీసీసీఐ నుంచి ఎవరు ఉండాలనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై త్వరలోనే ఓ స్పష్టత వస్తుంది. ఇందుకోసం కొంచెం సమయం పడుతుంది. బీసీసీఐ నుంచి పోటీ పెడదామా.. లేక వేరే వాళ్లకు సపోర్ట్‌ చేద్దామా అనే విషయంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు' అని అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు.

ఐసీసీ చైర్మన్‌ పదవి కోసం జూలైలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా ఉన్న శశాంక్‌ మనోహర్‌ జూలై నెలలోనే ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. వాస్తవానికి మే నెలతోనే శశాంక్‌ పదవీ కాలం ముగిసినా.. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ఏర్పడటంతో మరో రెండు నెలలు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలుగా చైర్మన్‌ పదవిలో కొనసాగుతున్న మనోహర్‌.. మరోమారు ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా లేరు. ఇక జూలై తర్వాత ఐసీసీ చైర్మన్‌ పదవిలో కొనసాగనని మనోహర్‌ స్పష్టం చేయడంతో.. ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.

శశాంక్‌ మనోహర్‌ అనంతరం ఐసీసీ చైర్మన్‌గా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) చైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ ఎన్నికయ్యే అవకాశాలుగా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఐసీసీ చైర్మన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీనే సరైనోడు అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ బహిరంగంగా మద్దతుగా తెలిపారు. అంతకుముందే ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌ దాదానే ఉండాలని అభిప్రాయపడ్డారు. దాంతో ఐసీసీ చైర్మన్‌ పదవి కోసం గంగూలీ పోటీ ఖాయమనే వార్తలు వ్యాపించాయి. అయితే వీటిని అరుణ్‌ ధుమాల్‌ ఖండించారు. అయితే బీసీసీఐ ఎవరో ఒకర్ని పోటీలో నిలిపే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అది దాదా కూడా కావొచ్చు.

Story first published: Friday, May 29, 2020, 13:47 [IST]
Other articles published on May 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X