For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌ ఆస్ట్రేలియా తేల్చేసినా.. ఐసీసీ ఎందుకు ఆలస్యం చేస్తుందో తెలియట్లేదు: బీసీసీఐ

Arun Dhumal says Dont know why ICC is delaying T20 World Cup call when Australia has expressed inability

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించడం సాధ్యం కాదని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తేల్చేసినా.. టోర్నీ నిర్వహణపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తుందో తెలియడం లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కోశాధికారి అరుణ్‌ ధుమాల్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించడం అసాధ్యమని సీఏ ఛైర్మన్‌ ఎర్ల్‌ ఎడింగ్స్‌ మంగళవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఎందుకు ఈ ఆలస్యం:

ఎందుకు ఈ ఆలస్యం:

బుధవారం అరుణ్‌ ధుమాల్ 'ఇండియా టుడే'తో మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ సాధ్యం కాదని క్రికెట్ ఆస్ట్రేలియా చెబుతోంది. ఇంకా ఐసీసీ ఎదురుచూపులు ఎందుకు?. తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి ఐసీసీ ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్థం కావట్లేదు. వాయిదా వేయాలని నిర్ణయిస్తే ఆ విషయాన్ని త్వరగా వెల్లడించాలి. ఇది ప్రపంచ క్రికెట్‌కు మేలు చేస్తుంది' అని అన్నారు.

కచ్చితంగా ఐపీఎల్‌ నిర్వహిస్తాం:

కచ్చితంగా ఐపీఎల్‌ నిర్వహిస్తాం:

16 జట్లు ప్రపంచకప్‌లో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణ అంత సులువు కాదని ఎర్ల్‌ ఎడింగ్స్‌ తెలిపారు. అయితే ప్రపంచకప్‌ వాయిదా వేస్తే ఆ సమయంలో ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్న సంగతి తెలిసిందే. 'టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే కచ్చితంగా అక్టోబర్‌-నవంబర్‌లో ఐపీఎల్‌ 2020ని నిర్వహిస్తాం. అయితే ఐసీసీ అధికారికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించాల్సి ఉంది. వారు వెల్లడించిన నిర్ణయాలకు అనుగుణంగా మేం లీగ్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తాం' అని అరుణ్‌ ధుమాల్ చెప్పారు.

ఎక్కడ సురక్షితమని భావిస్తే అక్కడే:

ఎక్కడ సురక్షితమని భావిస్తే అక్కడే:

భారత్‌లో కుదరకపోతే ఐపీఎల్‌ను శ్రీలంక, యూఏఈలో నిర్వహించాలని వస్తున్న ప్రతిపాదనలపై కూడా అరుణ్‌ ధుమాల్ స్పందించారు. 'అన్ని విధాలుగా పరిశీలించి మా ఆటగాళ్లు ఎక్కడ సురక్షితమని భావిస్తే అక్కడ నిర్వహిస్తాం' అని పేర్కొన్నారు. ఐపీఎల్ నిర్వహణ భారత్‌లో కుదరకపోతే శ్రీలంక, యూఏఈలో జరిపించాలని టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గావస్కర్‌ అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

జూలైలో ప్రకటిస్తామని చెప్పిన ఐసీసీ:

జూలైలో ప్రకటిస్తామని చెప్పిన ఐసీసీ:

షెడ్యూల్‌ ప్రకారం టీ20 ప్రపంచకప్‌ ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 18నుంచి నవంబర్‌ 15వ తేదీ వరకు జరగాల్సింది. కాగా మెగాటోర్నీ భవితవ్యంపై బోర్డు సభ్యులతో చర్చించిన ఐసీసీ.. నిర్ణయాన్ని జూలైలో ప్రకటిస్తామని చెప్పింది. మహమ్మారి నేపథ్యంలో ఇంత రిస్క్‌ తీసుకొని ప్రపంచకప్‌ నిర్వహించే బదులు.. భారత్‌తో సిరీస్‌లకు ఆతిథ్యమిస్తే ఆర్థికంగా పుంజుకోవచ్చని సీఏ భావిస్తున్నది. మరోవైపు.. కుదింపు లేదా పూర్తి స్థాయి టోర్నీ.. స్వదేశంలో లేదా విదేశాల్లో.. ఎలాగైనా సరే ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహిస్తే చాలని చాలా ఫ్రాంచైజీలు అనుకుంటున్నాయి.

Story first published: Wednesday, June 17, 2020, 20:18 [IST]
Other articles published on Jun 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+