For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతడి వల్ల ఒరిగిందేమీ లేదు: పాక్ క్రికెట్ ముందు సాగాలంటే ఇది చేయండి

Arthur should make way for others to take Pakistan cricket forward: Qadir

హైదరాబాద్: పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్‌ను తిరిగి కొనసాగించాలా? వద్దా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్కమవుతున్నాయి. మికీ ఆర్థర్‌కు మరోక అవకాశం ఇవ్వాలని పాక్‌ మాజీ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్‌ పేర్కొనగా... ఆ దేశానికి చెందిన స్పిన్‌ లెజెండ్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ మాత్రం అతడి సేవలు అవసరం లేదని అన్నాడు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు ఆర్థర్‌ ఏమి చేశాడంటూ ప్రశ్నించాడు. తన దృష్టితో చూస్తే మికీ ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి అక్రమ్ చెప్పడంపై మండిపడ్డాడు. పీసీబీ కమిటీలో సభ్యుడిగా ఉన్న అక్రమ్‌.. మికీ ఆర్థర్‌‌కు మద్దతుగా నిలవడం ఎంతమాత్రం బాలేదని అన్నాడు.

ఓ ఇంటర్యూలో అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ "నాకు తెలుసు... ఆర్ధర్‌కు మరో అవకాశం ఇవ్వాలని పీసీబీతో వసీం అక్రమ్ చెప్పాడు. నా వరకు అయితే ఇది ఇతరులతో అన్యాయం చేయడం లాంటిది. జాతీయ జట్టుని ముందుకు తీసుకెళ్లాలంటే మిగతా వారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా" అని అన్నాడు.

ఆర్థర్‌ వచ్చిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్‌ జట్టుకు నష్టమే జరిగిందే కానీ లాభం చేకూరలేదని ఖాదిర్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ జట్టుకు అతడు చేసింది ఏమీ లేదని అన్నాడు. కమ్రాన్‌ అక్మల్‌, ఉమర్‌ అక్మల్‌, సొహైల్‌ ఖాన్‌ వంటి క్రికెటర్లు జాతీయ జట్టుకు దూరం కావడానికి ఆర్థరే కారణమని మండిపడ్డాడు.

వాహాబ్‌ రియాజ్‌ వంటి ఒక స్టార్‌ పేసర్‌ పాక్‌ క్రికెట్‌కు రెండేళ్లు దూరం కావడానికి ఆర్థరే కారణమని విమర్శించాడు. వరల్డ్‌కప్‌కు చివరి నిమిషంలో చేసేదేమీ లేక ఒత్తిడితో వాహాబ్ రియాజ్‌కు చోటు కల్పించడాన్ని ఆర్ధర్ ఒప్పుకున్నాడని ఖాదిర్‌ విమర్శించాడు. ఇంతటితో మికీ ఆర్థర్‌ సేవలకు ముగింపు పలకాలని పీసీబీకి సూచించాడు.

పాక్ జట్టులో హెడ్ కలిగి ఉండటంలో తనకు ఏ విధమైన అర్ధమూ కనిపించలేదని దానికి బదులుగా బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ విభాగాలలో స్పెషలిస్ట్ కోచ్లకు ప్రాధాన్యత ఇచ్చానని ఖాదీర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే అబ్దుల్ ఖాదిర్ పాక్ తరుపున 67 టెస్టులు, 104 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Sunday, July 28, 2019, 17:13 [IST]
Other articles published on Jul 28, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+