ఫ్లైట్‌లో చాహల్‌కు చుక్కలు చూపిన అర్ష్‌దీప్.. 'క్యూట్' వీడియో వైరల్!
ఐపీఎల్ 2026 సీజన్ జోరుగా సాగుతున్న తరుణంలో పంజాబ్ కింగ్స్ జట్టులో ఓ సరదా సంఘటన సోషల్ మీడియాలో నెటిజన్లను అలరిస్తోంది. జట్టు తదుపరి మ్యాచ్ కోసం విమానంలో ప్రయాణిస్తుండగా.. భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను అర్ష్‌దీప్ సింగ్ ఆటపట్టించి అందరినీ నవ్వించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్లైట్‌లో మైక్ చేతబట్టిన అర్ష్‌దీప్ సింగ్.. అందరి ముందు 'క్యూట్-క్యూట్' అని పదేపదే అనడం, ఆ మాట వినగానే జట్టులోని ఇతర ఆటగాళ్లంతా నవ్వుల్లో మునిగిపోవడం ఆ వీడియోలో చూడవచ్చు.
ఆటపట్టించిన అర్ష్‌దీప్ సింగ్
అర్ష్‌దీప్ సింగ్ కావాలనే యువ ఆటగాడు ప్రియాంశ్ ఆర్యను ఆటపట్టిస్తున్నట్లు నటిస్తూ.. పక్కనే కూర్చున్న యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి 'క్యూట్-క్యూట్' అంటూ ఆటపట్టించాడు. ప్రియాంశ్ ఆర్యను ఉద్దేశించి అలా అంటున్నట్లు కనిపించినా, అసలు లక్ష్యం మాత్రం పక్కనే కూర్చున్న యుజ్వేంద్ర చాహల్ అని అందరికీ అర్థమైంది. అర్ష్‌దీప్ చేస్తున్న ఈ సరదా చేష్టలకు జట్టు సభ్యులంతా నవ్వుల్లో మునిగిపోగా.. చాహల్ మాత్రం నవ్వుతూ మౌనంగా ఉండిపోయాడు. అర్ష్‌దీప్ ఇలా చాహల్‌ను 'క్యూట్' అంటూ ఎగతాళి చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. ఇటీవల నటి, ఇన్‌ఫ్లుయెన్సర్ తానియా ఛటర్జీ.. యుజ్వేంద్ర చాహల్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఆ ఘటన నేపథ్యంలో చాహల్‌ను నెటిజన్లు 'క్యూట్' అనే పదాన్ని వాడుతూ ట్రోల్ చేస్తున్నారు. అర్ష్‌దీప్ ఇప్పుడు అదే 'క్యూట్' పదాన్ని ఆయుధంగా చేసుకుని, సహచర ఆటగాడిని సరదాగా ఇబ్బంది పెట్టాడు.

మరోవైపు మైదానంలో, ప్రయాణాల్లో ఈ తరహా సరదా కబుర్లు నడుస్తుంటే.. తెరవెనుక మాత్రం ఈ వ్యవహారం తీవ్రమైన మలుపు తీసుకుంది. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా తానియా ఛటర్జీ ఆరోపణలు చేస్తున్నారని భావించిన యుజ్వేంద్ర చాహల్, ఆమెపై పరువు నష్టం దావా వేయడం ద్వారా న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ కేసు ఇప్పుడు క్రీడా వర్గాల్లోనే కాకుండా, సినీ పరిశ్రమలో కూడా చర్చనీయాంశమైంది. చాహల్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
తానియా ఛటర్జీ ఎవరు?
తానియా ఛటర్జీ విషయానికి వస్తే.. ఆమె కోల్‌కతాకు చెందిన ప్రముఖ మోడల్, నటి. ఓటీటీ వేదికలపై 'గందీ బాత్' సీజన్ 4 వంటి ప్రాజెక్టులతో గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు ఈ వివాదం కారణంగా అనూహ్యంగా వార్తల్లో నిలిచారు. తన కామెంట్స్ ఇంతలా వైరల్ అవుతాయని ఊహించలేదని, ఇప్పుడు తనపైనే ఎదురుదాడి జరుగుతోందని తానియా ఛటర్జీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద ఓ చిన్న ఇన్‌స్టాగ్రామ్ సందేశం చుట్టూ మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు చట్టపరమైన పోరాటంగా మారి, క్రికెటర్ చాహల్, నటి తానియా మధ్య అగ్గిని రాజేస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంలో ఓ వైపు కోర్టు కేసు, మరోవైపు జట్టు సభ్యుల ఆటపట్టించడం వంటి పరిణామాలు, చాహల్ ప్రస్తుతం ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో స్పష్టం చేస్తున్నాయి. జట్టులో సహచరులు అతన్ని సరదాగా ఆటపట్టిస్తూ వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేస్తుండగా.. చాహల్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఐపీఎల్ వేదికపై రాణిస్తున్న చాహల్, తన వ్యక్తిగత వివాదాలను ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications