Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అర్ష్‌దీప్ సింగ్ సంచలన నిర్ణయం!

Arshdeep Singh: ఐపీఎల్ 2026 సీజన్ నుంచి పంజాబ్ కింగ్స్ జట్టు నిష్క్రమించిన తర్వాత ఆ జట్టు స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాపై సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి ఏకంగా 200కు పైగా పాత పోస్టులను తొలగించారు. ఇందులో 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో విరాట్ కోహ్లీతో కలిసి ఆయన షేర్ చేసిన ఓ వైరల్ పోస్ట్ కూడా ఉంది. ఈ పాత పోస్ట్‌కు గతంలో 150 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.

అర్ష్‌దీప్ సింగ్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడానికి గల అసలు కారణం ఇంకా అధికారికంగా తెలియరాలేదు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో ఆయన సోషల్ మీడియా యాక్టివిటీలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో తన వ్యక్తిగత ప్రొఫైల్‌ను రీసెట్ చేసుకోవడానికి లేదా రీబ్రాండింగ్ కోసం ఈ పద్ధతిని ఎంచుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం అర్ష్‌దీప్ సింగ్ ఇన్‌స్టా ప్రొఫైల్‌లో కేవలం 44 పోస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిలో ఎక్కువగా కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోలు, కెరీర్ మైలురాళ్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు మాత్రమే ఉన్నాయి.

Arshdeep Singh Deletes 200 Instagram Posts Post IPL 2026 Exit After Recent Vaping Racism Rows

ఈ ఐపీఎల్ సీజన్లో అర్ష్‌దీప్ సింగ్ తన ప్రవర్తన కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. మొదట అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియోలో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విమానంలో వేపింగ్ చేస్తూ కనిపించడం వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టుతో మ్యాచ్‌కు ముందు సహచర ఆటగాడు తిలక్ వర్మ చర్మ రంగును ఉద్దేశించి "ఓయ్ అంధేరే..."(ఓయ్ కర్రోడా) అంటూ అర్ష్‌దీప్ చేసిన కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. నెటిజన్లు దీనిని వర్ణవివక్షతో కూడిన కామెంట్‌గా అభివర్ణిస్తూ అర్ష్‌దీప్ సింగ్‌పై మండిపడ్డారు. దీనికి తోడు స్నాప్‌చాట్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన ఘాటైన సమాధానం కూడా వివాదాస్పదమైంది.

స్టేడియంలోనూ ఈ సీజన్ అర్ష్‌దీప్ సింగ్‌కు పెద్దగా కలిసిరాలేదు. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఆయన కేవలం 14 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. వికెట్లు తీసినప్పటికీ పరుగులను నియంత్రించడంలో ఘోరంగా విఫలమవడంతో అర్ష్‌దీప్ సింగ్ ఎకానమీ రేటు 10.21గా నమోదైంది. అటు బౌలింగ్‌లో వైఫల్యం, ఇటు సోషల్ మీడియాలో వరుస వివాదాల కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనైన అర్ష్‌దీప్.. మానసిక ప్రశాంతత కోసమే తన సోషల్ మీడియా ఖాతాను క్లీన్ చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Story first published: Tuesday, May 26, 2026, 12:26 [IST]
Other articles published on May 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+