బుడ్డోడిని అడ్డుకోవాలంటే అదొక్కటే దారి: టీమిండియా మాజీ స్టార్
ఐపీఎల్ లో నేడు మరో హైవెలాసిటీ మ్యాచ్ జరుగనుంది. ఈ సాయంత్రం చండీగఢ్ లో పంజాబ్ కింగ్స్ తో తలపడబోతోంది రాజస్థాన్ రాయల్స్. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా ఉంటూ వస్తోన్న పీబీకేఎస్ ను వాళ్ల సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ ఎలా అడ్డుకుంటుందనేది ఈ రాత్రికి తేలిపోతుంది. పాయింట్ల పట్టిలో అగ్రస్థానంలో ఉన్న జట్లు ఇవి. పంజాబ్ టాప్ లో ఉండగా.. రాజస్థాన్ నాలుగో పొజీషన్ లో కొనసాగుతోంది.
రాజస్థాన్ రాయల్స్ లో వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి నిలిచిందనడంలో సందేహాలు అక్కర్లేదు. మొన్నటికి మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ పై సెంచరీ ఊది అవతలపడేశాడీ 15 సంవత్సరాల కుర్రాడు. అతన్ని అడ్డుకోవడంపైనే ఆ జట్టు భారీ స్కోర్ ఆధారపడి ఉంది. దీనికోసం పంజాబ్ కింగ్స్ ప్రత్యేకంగా వల పన్నడం ఖాయం. బౌలర్లు వేసే బంతులు ఖచ్చితత్వంతో కూడుకుని ఉండటం, సరైన్ లైన్ అండ్ లెంగ్త్ తో పడితేనే దాని ఫలితం ఉంటుంది.

ఈ పరిస్థితుల మధ్య టీమిండియా మాజీ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా తెరమీదికి వచ్చాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లకు కొన్ని సూచనలు చేశాడు. వైభవ్ సూర్యవంశీని త్వరగా అవుట్ చేసే విషయంలో ప్రత్యేకించి సీమర్ అర్షదీప్ సింగ్ కు చిట్కాలు ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశికి బౌలింగ్ చేసేటప్పుడు మిడిల్, ఆఫ్ స్టంప్ మీదుగా బంతిని సంధించాలని చెప్పాడు.
స్టార్ స్పోర్ట్స్ 'గేమ్ ప్లాన్' లో పుజారా మాట్లాడాడు. అర్షదీప్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని, స్లో బాల్స్, యార్కర్లను కూడా ప్రభావవంతంగా ఉపయోగించాలని సూచించాడు. "అర్షదీప్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అయినందున వైభవ్ కోసం స్టంప్‌ల మీదుగా బౌలింగ్ వేయాలని, బంతి అతని నుండి బయటికి వెళ్ళేలా మిడిల్, ఆఫ్ స్టంప్ లపై పిచ్ అయ్యేలా లైన్ అండ్ లెంగ్త్ తో డెలివరీలు ఉండాలని చెప్పాడు. వైభవ్‌కు బౌలింగ్ చేసినప్పుడు మొహిసిన్ కొంత సక్సెస్ అయ్యాడని గుర్తు చేశాడు పుజారా.
అర్షదీప్ కూడా అలాంటి టెక్నిక్ నే ఫాలో అయితే వైభవ్ సూర్యవంశీ దూకుడును అడ్డుకోవచ్చని సూచించాడు. అవసరమైతే ఓవర్ మిడిల్ లో యార్కర్లు కూడా వేయాల్సి రావొచ్చని, ప్రారంభంలో, మొదటి నాలుగు లేదా అయిదు బంతులను మాత్రం మిడిల్ అండ్ ఆఫ్ స్టంప్‌పై బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌ను అర్ష్ దీప్ సింగ్ నిలకడగా వేయాలని పుజారా వివరించాడు. అర్షదీప్ సింగ్, మార్కో జెన్‌సెన్, జేవియర్ బార్ట్‌లెట్‌ను కూడా వైభవ్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications