విరాట్ కోహ్లీ మెడకు చుట్టుకున్న హత్య కేసు - డిస్టర్బ్..!!

ముంబై: ఇంకొన్ని గంటల్లో టీ20 ప్రపంచకప్ 2022 పోరు ఆరంభం కాబోతోంది. ఆస్ట్రేలియా వేదికగా 12 జట్లు ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో తలపడనున్నాయి. దీనికోసం భారత్ సన్నద్ధమౌతోంది. టీమ్ కాన్సన్‌ట్రేషన్ మొత్తం కప్ మీదే ఉంది. ఈ టోర్నమెంట్‌లో తన ప్రస్థానాన్ని ఈ నెల 23వ తేదీన ఆరంభించనుంది టీమిండియా. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. దీనికోసం సన్నాహాలు చేస్తోంది. నెట్స్‌లో శ్రమిస్తోన్నారు ప్లేయర్లు.
అరెస్ట్ కోహ్లీ..
ఈ పరిస్థితుల మధ్య సోషల్ మీడియాలో చోటు చేసుకున్న ఉదంతం టీమిండియాను డిస్టర్బ్ చేసేదే. ఇది- టీమిండియా బ్యాటింగ్ బ్యాక్‌బోన్ విరాట్ కోహ్లీని టార్గెట్‌గా చేసుకున్నది కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. #ArrestKohli అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు నెటిజన్లు. ఈ హ్యాష్ ట్యాగ్ కింద వందల సంఖ్యలో ట్వీట్లు పోటెత్తుతున్నాయి.
తమిళనాడు మర్డర్ కేస్..
దీనికి కారణం లేకపోలేదు. ఇటీవలే తమిళనాడులో చోటు చేసుకున్న హత్యోదంతాన్ని నెటిజన్లు తమ డిమాండ్‌కు ఆధారంగా చేసుకుంటోన్నారు. తమిళనాడులోని అరియలూరు జిల్లా పొయ్యూర్ గ్రామానికి చెందిన ఎస్ ధర్మరాజ్ అనే విరాట్ కోహ్లీ వీరాభిమాని.. తన స్నేహితుడు, అదే గ్రామానికే చెందిన పీ విఘ్నేష్ అనే రోహిత్ శర్మ అభిమానిని హత్య చేసిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో ధర్మరాజ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
కోహ్లీని కించపరిచేలా..
పొయ్యూర్ గ్రామానికే చెందిన పీ విఘ్నేష్ కొంతకాలంగా సింగపూర్‌లో ఉంటోన్నాడు. వర్క్ విసా కోసం స్వగ్రామానికి వచ్చాడు. మల్లూర్ సమీపంలోని సిడ్కో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ధర్మరాజ్ సహా ఇతర స్నేహితులతో కలిసి క్రికెట్ చూస్తోన్న సమయంలో గొడవ చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీని కించపరిచేలా విఘ్నేష్ కామెంట్స్ చేయడంతో ఆగ్రహించిన ధర్మరాజ్ అతనిపై దాడి చేశాడు. బాటిల్‌తో కొట్టాడు. క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టాడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
స్పందిచట్లేదేంటీ?
ఈ ఘటనపై కీలపనూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ధర్మరాజ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం ఇప్పుడు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలనే డిమాండ్‌కు దారి తీసింది. ఈ హత్యను కూడా విరాట్ కోహ్లీకి చెందిన కొందరు డైహార్డ్ ఫ్యాన్స్ సమర్థించుకుంటోన్నారంటూ మండిపడుతున్నారు. అభిమానులు చేస్తోన్న పనికి విరాట్ కోహ్లీ బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. ఇంత జరుగుతున్నా కోహ్లీ స్పందించట్లేదని విమర్శిస్తోన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications