ఉగ్రవాది సోదరుడితో ఆఫ్రిదీ, హీనా రబ్బానీ
న్యూఢిల్లీ: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్‌లో చేపట్టిన భారీ రాకెట్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రాకెట్‌లో భాగంగా ఢిల్లీలో రెక్కీ నిర్వహించేందుకు వచ్చి అరెస్టయిన ఉగ్రవాది మహమ్మద్ ఎజాజ్ సోదరుడి ఫొటోలు వెలుగు చూశాయి.
పాకిస్తాన్ జాతీయుడైన ఎజాజ్ సోదరుడు ఫవాద్ ఆ దేశానికి చెందిన ప్రముఖులతో దిగిన ఫోటోలు భారత పోలీసులకు చిక్కాయి. ఫవాద్ పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీలతో దిగిన ఫొటోలు బయటపడ్డాయి.

ఈ ఫొటోలు నకిలీవా, అసలువేనా అని తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. ఉగ్రవాది మహమ్మద్ ఎజాజ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో భారత్‌కు వచ్చిన ఎజాజ్ ఈ ఏడాది మార్చి, జులై నెలల్లో రెండుసార్లు ఢిల్లీని సందర్శించాడు.
తన పర్యటనల్లో ఎజాజ్ పార్లమెంటు, రాజ్‌పథ్ ఎదురుగా దిగిన ఫొటోలను పాకిస్తాన్‌కు మెయిల్ చేశాడు. ఢిల్లీలో రెక్కీ నిర్వహించేందుకు తనను ఐఎస్ఐ ఇక్కడికి పంపించినట్లు అతను పోలీసుల విచారణలో అంగీకరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications