Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఉపఖండంలో ఆధిపత్యం ఎక్కువ.. సొంతగడ్డపై భారత్‌ను ఓడించే సత్తా మాకు ఉంది'

IND VS AUS 2020 : Aaron Finch Confident As Australia Head For 3-Match ODI Series ! || Oneindia
Aron Finch says Sub-continent can make you doubt your abilities but were ready for India

సిడ్నీ: ఉపఖండంలో జట్టు ఏదైనా కానీ అక్కడ వారి ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు పర్యాటక జట్లను తమపై తామే అనుమానపడేలా చేస్తారు అని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ పేర్కొన్నాడు. ఆత్మవిశ్వాసం లేకుండా ఉపఖండంలో ఆడటం కష్టం. టీమిండియాను ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్‌ను వారి దేశంలో ఓడించే సత్తా మాకు ఉంది అని ఫించ్‌ ధీమా వ్యక్తం చేసాడు.

ఉపఖండంలో ఆధిపత్యం ఎక్కువ

ఉపఖండంలో ఆధిపత్యం ఎక్కువ

జనవరి 14 నుంచి ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫించ్‌ మీడియాతో మాట్లాడుతూ... 'పర్యాటక ఆటగాళ్ల సామర్థ్యాలపై ఉపఖండం అనుమానం వచ్చేలా చేస్తుంది. ఉపఖండంలో పర్యటిస్తున్నప్పుడు మన ప్రణాళికపై మనకే అనుమానం ఉంటుంది. భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్టు ఏదైనా కానివ్వండి అక్కడ వారి ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది' అని అన్నాడు.

భారత్‌ను ఓడించే సత్తా ఉంది:

భారత్‌ను ఓడించే సత్తా ఉంది:

'మన ప్రణాళిక, సామర్థ్యాలు, నైపుణ్యాలు బాగున్నాయని తెలుసుకున్నప్పుడు భారత్‌ను ఓడించగలం. అదే మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. భారత్‌పై ఎప్పుడూ అనుమాన పడుతూ గేమ్‌ ఆడకూడదు. అలా చేస్తే టీమిండియా ముందుగానే పైచేయి సాధిస్తుంది. టీమిండియాపై దూకుడుగా ఆడి సత్తాచాటతాం. భారత్‌ను వారి దేశంలో ఓడించే సత్తా మాకు ఉంది. మా ఆటగాళ్ల ప్రదర్శనపై నాకు నమ్మకం ఉంది' అని ఫించ్‌ పేర్కొన్నాడు.

మందకొడి పిచ్‌లపై బాగా ఆడతాడు:

మందకొడి పిచ్‌లపై బాగా ఆడతాడు:

'మార్నస్‌ లబుషేన్‌ మార్ష్‌కప్‌లో అద్భుతంగా ఆడాడు. దేశవాళీల్లో కీలకమైన నాలుగో స్థానంలో ఆడాడు. స్పిన్‌కు అనుకూలించే మందకొడి పిచ్‌లపై లబుషేన్‌ బాగా ఆడతాడు. అందుకే అతడికి జట్టులో చోటు దక్కింది. తన టెస్టు ఫామ్‌ను వన్డేల్లో కూడా కొనసాగిస్తాడనడంలో మాకెలాంటి సందేహం లేదు. అతడి రాకతో మిగతా ఆటగాళ్లకేమీ తలుపులు మూసుకుపోలేదు. సరైన ప్రాంతంలో సరైన సమయంలో సరిపోయే జట్టును మేం ఎంపిక చేస్తాం' అని ఫించ్‌ చెప్పుకొచ్చాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో లబుషేన్‌ అరంగేట్రం?:

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో లబుషేన్‌ అరంగేట్రం?:

గత కొంతకాలంగా ఆస్ట్రేలియా టెస్టు జట్టులో లబుషేన్‌ రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయాడు. వరుసగా సెంచరీలు బాదుతూ ఆసీస్‌ టెస్టు జట్టులో ప్రత్యేక ముద్ర వేశాడు. అతని రాకతో ఆసీస్‌ జట్టు మరింత బలోపేతం అయింది. గతేడాది వెయ్యి టెస్టు పరుగులకు పైగా సాధించి ఆ ఫీట్‌ సాధించిన ఏకైక ఆటగాడిగా లబుషేన్‌ నిలిచాడు. ఇప్పటివరకూ సుదీర్ఘ ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమైన లబుషేన్‌.. టీమిండియాతో వన్డే సిరీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నాడు.

జనవరి 14న తొలి వన్డే:

జనవరి 14న తొలి వన్డే:

జనవరి 14 నుంచి 19వ తేదీ వరకూ భారత్‌-ఆసీస్‌ల మధ్య మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ జరుగనుంది. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో శ్రీలంక ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం భారత్‌-శ్రీలంకల మధ్య చివరి టీ20 జరుగనుంది. ఆసీస్‌ పర్యటన అనంతరం కివీస్టూర్ ఉన్న విషయం తెలిసిందే.

Story first published: Thursday, January 9, 2020, 16:03 [IST]
Other articles published on Jan 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+