హైదరాబాద్: ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, భారత్ జట్లు తలపడుతున్నాయి. భారత్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు. ఇంగ్లాండ్ మాత్రం మూడుసార్లు వరల్డ్ కప్‌ను (1973, 1993, 2009) గెలుచుకుంది.
2005లో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన భారత్.. మళ్లీ ఇప్పుడు ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈసారి వరల్డ్ కప్‌ను గెలవాలనే పట్టుదలతో మిథాలీ సేన నెట్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం మిథాలీ సేనకు అనుకోని అతిథి బౌలింగ్ చేశాడు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ శనివారం లార్డ్స్‌లో మిథాలీ సేనకు నెట్స్‌లో బౌలర్‌గా మారాడు. భారత మహిళల జట్టుకు బౌలింగ్ చేశాడు. పలువురు బ్యాట్స్‌మెన్ అతని పేస్ బౌలింగ్‌లో చక్కగా ప్రాక్టీస్ చేశారు.
భారత మహిళా జట్టులో హిట్టర్‌గా పేరుగాంచిన వేద కృష్ణమూర్తి... అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే లార్డ్స్ నెట్స్ అర్జున్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ఇదే మొదటిసారి కాదు.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టుకు కూడా బౌలింగ్ చేశాడు. ఈ సమయంలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెయిర్ స్టో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్‌లో ఉన్న అర్జున్ లార్డ్స్ మైదానంలోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో శిక్షణ తీసుకుంటున్నాడు.
ఇక ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు 10 సార్లు తలపడగా... భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్ ఆరు మ్యాచ్‌ల్లో గెలిచాయి. లార్డ్స్ మైదానంలో ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా... చెరో మ్యాచ్‌లో గెలిచాయి. మరో మ్యాచ్ రద్దు అయింది. కెప్టెన్ హోదాలో రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న తొలి భారతీయ క్రికెటర్‌గా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది.
భారత్: పూనమ్ రౌత్, స్మృతి మంధానా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి, శిఖా పాండే, సుష్మా వర్మ (వికెట్‌కీపర్), జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్/ఏక్తా బిస్త్
ఇంగ్లాండ్: లారెన్ విన్‌ఫీల్డ్, టామీ బ్యూమాంట్, హెదర్ నైట్ (కెప్టెన్), సారా టేలర్, నటాలీ షీవర్, ఫ్రాన్ విల్సన్, కేథరిన్ బ్రంట్, జెన్నీ గున్, లారా మార్ష్, అన్య ష్రబ్‌సోల్, అలెక్స్ హార్ట్‌లీ
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్షప్రసారం