For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కూచ్‌ బెహర్‌ టోర్నీలో ఐదేసిన అర్జున్ టెండూల్కర్

By Nageshwara Rao
Arjun Tendulkar shines with ball

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్‌ కూచ్‌ బెహర్‌ ట్రోఫీ అండర్‌-19 క్రికెట్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీలో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ ఐదు వికెట్లు తీశాడు. ముంబై తరుపున ఆడుతున్న అర్జున్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ తీసుకున్న అర్జున్‌ రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు బౌలింగ్‌ చేసి 95 పరుగులిచ్చి ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మధ్యప్రదేశ్‌ 361 పరుగులు చేయగా.. ముంబై 506 పరుగులు చేసింది.

ఇక, రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ 8 వికెట్లకు 411 పరుగులు సాధించగా... మ్యాచ్‌ ముగిసే సమయానికి ముంబై వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌ 'డ్రా'గా ముగియడంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా ముంబై మూడు పాయింట్లు సంపాదించింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, November 23, 2017, 10:16 [IST]
Other articles published on Nov 23, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+