For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా ఫాదర్ కాదు.. ఆ ప్లేయర్ అంటే చాలా ఇష్టం: అర్జున్ టెండూల్కర్

భారత క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ వారసుడిగా భారీ అంచనాల మధ్య కెరీర్ ప్రారంభించిన అర్జున్ టెండూల్కర్‌పై సోషల్ మీడియాలో తరచూ విమర్శలు, ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఆయనపై తండ్రికి తగ్గ తనయుడు కాదంటూ కొందరు దారుణంగా కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ లో అర్జున్ టెండూల్కర్ తన ఆఫ్-ఫీల్డ్ లైఫ్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. తన వ్యక్తిగత అలవాట్లు, స్నేహాల గురించి మనసు విప్పి మాట్లాడాడు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మారిన అర్జున్ టెండూల్కర్.. ఈ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

నా ఫ్రెండ్స్‌కు క్రికెట్ తెలియదు!
శుభంకర్ మిశ్రా నిర్వహించిన ఇంటర్వ్యూలో అర్జున్ టెండూల్కర్ మాట్లాడుతూ.. తనకు క్రికెట్ ఆడే స్నేహితులు చాలా తక్కువని వెల్లడించారు. "నా స్నేహితుల్లో చాలామందికి అసలు క్రికెట్ అంటే పెద్దగా తెలియదు. వారితో నేను ఎప్పుడూ క్రికెట్ గురించి చర్చించను" అని అర్జున్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు. అంత బిజీ లైఫ్‌లో కూడా తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి గోవాలోని తన నివాసంలో ఉన్న 5 కుక్కలతో సమయం గడుపుతానని అర్జున్ టెండూల్కర్ వెల్లడించారు.

Arjun Tendulkar Reveals Why He Has No Cricketer Friends and Names His Idol Beyond Sachin

ట్రోలింగ్‌పై ధీటైన సమాధానం
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వారసుడు కావడంతో సోషల్ మీడియాలో నిరంతరం ఎదురయ్యే విమర్శలు, ట్రోలింగ్‌పై అర్జున్ టెండూల్కర్ చాలా స్పష్టంగా స్పందించాడు. విమర్శలంటే తనకు భయం లేదని.. తన పని తాను చేసుకుపోతానని ధీమా వ్యక్తం చేశాడు. గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి దిగ్గజ బౌలర్లు ఉండటంతో అర్జున్ టెండూల్కర్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు లక్నో జట్టు మహమ్మద్ షమీ, మయాంక్ యాదవ్ వంటి వారితో కలిసి తన సత్తా చాటేందుకు అర్జున్ టెండూల్కర్ సిద్ధమవుతున్నాడు.

నచ్చిన ప్లేయర్ ఎవరంటే?
తన తండ్రి సచిన్ టెండూల్కర్ కాకుండా ఎవరిని ఆరాధిస్తారు అన్న ప్రశ్నకు అర్జున్ టెండూల్కర్ టక్కున యువరాజ్ సింగ్ పేరు చెప్పాడు. యువీ బౌలింగ్ ను ఇష్టపడతారా అని అడగగా.. "ఆయన స్పిన్నర్, నేను ఫాస్ట్ బౌలర్‌ని" అంటూ నవ్వుతూ అర్జున్ టెండూల్కర్ బదులిచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఈ సారి అర్జున్ టెండూల్కర్ తన పేస్ బౌలింగ్‌తోనే కాకుండా.. లోయర్ ఆర్డర్‌లో తన బ్యాటింగ్ మెరుపులతో జట్టుకు ఉపయోగపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ ఆరంభం నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని పక్కన పెట్టి, ఈ సీజన్లో అర్జున్ టెండూల్కర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారో లేదో చూడాలి.

Story first published: Wednesday, April 1, 2026, 11:38 [IST]
Other articles published on Apr 1, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+