Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీనియర్ టీ20 లీగ్ మ్యాచుల్లో అర్జున్ టెండుల్కర్! ముంబై టీ20 లీగ్ కోసం త్వరలో వేలంపాటలు!

Arjun Tendulkar puts his name in auction pool for T20 Mumbai League

ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండుల్కర్ సీనియర్ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. ఇన్నాళ్లూ అండర్-19 తరఫున క్రికెట్ ఆడుతూ వచ్చిన అర్జున్.. ఇక టీ20 ముంబై లీగ్ మ్యాచుల్లో తన పేరు నమోదు చేసుకున్నాడు. టీ20 ముంబై లీగ్ మ్యాచుల కోసం త్వరలో వేలంపాటలను నిర్వహించబోతున్నారు నిర్వాహకులు. ఈ టీ20 మెగా టోర్నమెంట్ లో ఆడటానికి అర్జున్ టెండుల్కర్ సన్నాహాలు చేస్తున్నాడు. టీ20 ముంబై లీగ్ మ్యాచుల్లో ఆడటానికి తన పేరును ఇచ్చాడు. త్వరలో నిర్వహించే వేలం పాట సందర్భంగా అర్జున్ టెండుల్కర్ పేరు కూడా వినిపిస్తుంది.

ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్జున్. గత ఏడాది శ్రీలంకతో భారత్ తరఫున రెండు అండర్‌-19 టెస్టులు ఆడాడు. వేలంలో అర్జున్‌ పేరు రానుండడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డీవై పాటిల్‌ టీ20 టోర్నీతోపాటు ముంబై అండర్‌-23 టీమ్‌ తరఫున కూడా ఆడాడు.

Story first published: Sunday, March 17, 2019, 14:07 [IST]
Other articles published on Mar 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+