Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్‌కు గాయం

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో గాయపడ్డాడు. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు గాయ పడటం ఏంటని అనుకుంటున్నారా?

వివరాల్లోకి వెళితే... గురువారం నుంచి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లార్డ్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోనే ఉన్న అర్జున్ టెండూల్కర్ లార్డ్స్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అర్జున్ బౌలింగ్ వేశాడు.

Arjun Tendulkar injures England player at Lord's nets

ఈ సంద‌ర్భంగా ఈ లెఫ్టామ్ పేస్ బౌల‌ర్ విసిరిన ఓ యార్క‌ర్‌.. బెయిర్ స్టో పాదానికి బ‌లంగా త‌గిలింది. దీంతో అత‌ను వెంట‌నే నెట్స్ వ‌ద‌లి వెళ్లిపోయాడు. వేళ్ల‌కు ఏమైనా ఫ్రాక్చ‌ర్ అయిందేమో అన్న ఉద్దేశంతో బెయిర్ స్టోను కాసేపు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచారు. అయితే గాయం అంత తీవ్రమైనది కాదని దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో ఆతడు ఆడుతున్నాడని డెయిలీ మెయిల్ రాసుకొచ్చింది.

ఇదిలా ఉంటే గతంలో కూడా అర్జున్ టెండూల్కర్ లార్డ్స్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన సంగతి తెలిసిందే. పాక్ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రమ్ కూడా అర్జున్ బౌలింగ్‌ని మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గురువారం దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే తొలి టెస్టులో ఇంగ్లాండ్‌కు జో రూట్‌ కెప్టెన్సీ వహించనున్నాడు.

అలెస్టర్ కుక్ రాజీనామాతో ఫిబ్రవరిలోనే 26 ఏళ్ల రూట్‌కు కెప్టెన్సీ దక్కింది. రూట్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌ ఆడుతున్న తొలి టెస్టు ఇదే. అయితే ఈ టెస్టులో కుక్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగనున్నాడు. దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్‌ మొత్తం నాలుగు టెస్టులు ఆడనుంది. దక్షిణాఫ్రికా గత పదేళ్లలో విదేశాల్లో ఒకే ఒక్క టెస్టు సిరీస్‌ చేజార్చుకుంది.

అయితే ఈ టెస్టు సిరిస్‌కు డివిలియర్స్‌ అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు లోటే. తొలి టెస్టుకి దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ వ్యవహరించనున్నాడు. తన భార్య తొలి బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో రెగ్యులర్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దీంతో అతడు రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వస్తాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+