Arjun Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్మెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ముంబైకి చెందిన వ్యాపారవేత్త కుమార్తె సానియా చందోక్‌తో అర్జున్ నిశ్చితార్థం చేసుకున్నాడు.అయితే ఈ విషయంపై రెండు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
అర్జున్ తన అక్క కంటే రెండేళ్లు చిన్నవాడు. సారా వయస్సు 27 కాగా.. అర్జున్ వయస్సు 25. సాధారణంగా భారతీయ సంప్రదాయంలో పెద్దవారికి ముందు పెళ్లి జరుగుతుంది. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ తన కూతురు కంటే ముందే కుమారుడికి నిశ్చితార్థం ఎందుకు చేశారన్న చర్చ అభిమానుల్లో మొదలైంది. సారా కంటే ముందు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం గురించి అభిమానులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఎందుకు.. కెరీర్‌పై దృష్టి పెట్టాలని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా.. అర్జున్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్ కోసం కష్టపడుతున్నాడు. అతను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున, రంజీలో గోవా జట్టులో ఆడుతున్నాడు. అదే సమయంలో సారా కంటే ముందు అర్జున్ వివాహం గురించి కొంతమంది కొత్త వాదనలు చేస్తున్నారు.

శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్‌ల మధ్య సంబంధం ఉన్నట్లు చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. దీని వల్లే సారా వివాహం ఆలస్యం అవుతుందని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ పుకార్లకు ఎలాంటి ఆధారాలు లేవు. గిల్, సారా ఇద్దరూ తమ బంధం గురించి ఎప్పుడూ ఎలాంటి ప్రకటన చేయలేదు. సారా టెండూల్కర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో మెడిసిన్ చదువుతోంది. తన చదువు పూర్తయ్యేవరకు పెళ్లి వాయిదా వేసుకుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆమె వివాహం ఆలస్యం కావడానికి ఇది కూడా కారణం కావచ్చు.
శుభ్‌మన్ గిల్, సారా సంబంధం గురించి వచ్చిన పుకార్లలో నిజమెంత?
శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ మధ్య సంబంధం గురించి వచ్చిన పుకారు సోషల్ మీడియా పోస్ట్‌తో ప్రారంభమైంది. వారిద్దరూ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఒకేలా ఉండటం వల్ల వారి మధ్య ఏదో జరుగుతోందని వార్తలు వచ్చాయి. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన యువికన్ ఫౌండేషన్ కార్యక్రమంలో వారి మధ్య ఏదో జరుగుతోందని వార్తలు వచ్చాయి. సారా విషయంలో రవీంద్ర జడేజా కూడా గిల్‌ను ఆటపట్టించాడు. అయితే, గిల్ సారా కంటే రెండేళ్లు చిన్నవాడు. ఇద్దరూ తమ సంబంధం గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు.