పి. అర్జున్ టెండూల్కర్ అనే పేరు ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL)లో సంచలనం సృష్టించింది. అర్జున్ టెండూల్కర్ అనే పేరు వినగానే చాలా మందికి సచిన్ టెండూల్కర్ కొడుకు గుర్తుకు వస్తాడు. కానీ, ప్రపంచంలో ఒకే పేరుతో చాలా మంది ఉండొచ్చని మనం మర్చిపోతాం. ఈ సారి కూడా అలాంటిదే జరిగింది. పి. అర్జున్ టెండూల్కర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో సోమవారం విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.
మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న పి.అర్జున్ టెండూల్కర్
ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో కాకినాడ కింగ్స్ తరఫున ఆడిన పి.అర్జున్ టెండూల్కర్.. భీమవరం బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవం 12 బంతుల్లో 31 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 3 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 258కి పైగా స్ట్రైక్ రేట్‌తో అతని బ్యాటింగ్ చూసి బౌలర్లు నిస్సహాయంగా ఉండిపోయారు. ప్రేక్షకులు చప్పట్లతో హోరెత్తించారు. కాకినాడ కింగ్స్ ఈ యువ ఆటగాడిని రూ.1.20 లక్షలకు కొనుగోలు చేసింది.

విజయాన్ని అందించలేకపోయిన మెరుపు ఇన్నింగ్స్
అయితే, పీ. అర్జున్ టెండూల్కర్ మెరుపులు కూడా కాకినాడ కింగ్స్ జట్టును గెలిపించలేకపోయాయి. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో జట్టు కెప్టెన్ కె.ఎస్. భరత్ (40 బంతుల్లో 76 పరుగులు) మంచి సహకారం అందించినప్పటికీ, కాకినాడ కింగ్స్ మొత్తం 19.5 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భీమవరం బుల్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఎంగేజ్మెంట్ చేసుకున్న సచిన్ కుమారుడు
ఈ పీ.అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా ఆడుతుండగా.. మరోవైపు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచాడు. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె సానియా చందోక్‌తో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ రెండు వార్తల్లో "అర్జున్ టెండూల్కర్" అనే పేరు ఉండడం అభిమానుల్లో గందరగోళానికి దారితీసింది. అయితే ఈ ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు అని గమనించాలి.