Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో క్రిస్ గేల్‌లా అర్జున్ టెండూల్కర్!

Arjun Tendulkar: ఐపీఎల్ 2025 సీజన్‌లో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు. కానీ అర్జున్ కు ఇంకా ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. అయితే తాజాగా యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ అర్జున్ టెండూల్కర్ గురించి కీలక ప్రకటన చేశారు. అర్జున్ టెండూల్కర్‌కు ప్రతిభ ఉందని.. ముఖ్యంగా అతనిలో బ్యాటింగ్ టాలెంట్ ఉందని ఆయన అన్నారు. యోగరాజు సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కుమారుడు యువరాజ్‌కు అర్జున్ కి శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఇస్తే అతడిని క్రిస్ గేల్ లాగా తయారు చేయవచ్చని చెప్పుకొచ్చాడు.

బౌలింగ్ బదులుగా అతడిని బ్యాటింగ్ పై శ్రద్ధ వహించాలని తాను అర్జున్ కు చెప్పినట్లు యోగరాజ్ సింగ్ వెల్లడించారు. సచిన్ కొడుకు యువరాజ్ సింగ్ నుంచి మూడు నెలలు శిక్షణ తీసుకోవాలని.. అప్పుడు యువరాజ్ అతడిని క్రిస్ గేల్ లాంటి బ్యాటర్‌గా తీర్చిదిద్ధగలడని యోగరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఈ రోజు ఐపీఎల్‌లో యువరాజ్ సింగ్ ఇద్దరు శిష్యులు అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మలు ఇద్దరూ యువరాజ్ శిష్యులే. యువరాజ్ తరచూ ఈ ఇద్దరితో ఫోన్‌లో మాట్లాడి వారికి మార్గనిర్దేశం చేస్తాడు.

Arjun Tendulkar Can Be the Next Chris Gayle Yograj Singh s Bold Statement

ఐపీఎల్ 2025లో రాని అవకాశం
సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కు ఈ సీజన్లో ఆడటానికి ఇంకా అవకాశం రాలేదు. అర్జున్ టెండూల్కర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా చేరలేకపోయాడు. గత సీజన్లో అర్జున్ కొన్ని మ్యాచ్‌లు ఆడటానికి అవకాశాన్ని పొందాడు. కానీ ఈ సారి అతడికి ఆడటానికి అవకాశం లభించడం లేదని తెలుస్తోంది. ఐపీఎల్ 2025 వేలంలో అర్జున్ టెండూల్కర్ మొదటి రౌండ్లో అమ్ముడుపోయాడు. ముంబై ఇండియన్స్ అతడిని రూ.30 లక్షలకు కొనుగోలు చేశారు. అర్జున్ టెండూల్కర్ దేశీయ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే.. ఇప్పుడు అతను గోవా జట్టు తరపున ఆడుతున్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. అర్జున్ అరుణాచల్ పై 5 వికెట్లు తీశాడు. అయినప్పటికీ ఈ సారి ఐపీఎల్ లో ఆడడానికి అవకాశం లభించడం లేదు.

Story first published: Thursday, April 24, 2025, 17:39 [IST]
Other articles published on Apr 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+