హైదరాబాద్: వాంఖడె వేదికగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరు జట్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాయి. ఈ నెట్ ప్రాక్టీస్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా పాల్గొనడం విశేషం.

కోచ్ రవిశాస్త్రి సమక్షంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా జట్టు సభ్యులందరూ నెట్స్‌లో తీవ్రంగా చెమటొడ్చారు. వాంఖడే స్టేడియం నెట్స్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భారత బ్యాట్స్‌మన్‌కు అర్జున్ బౌలింగ్ చేశాడు. తొలుత ఓపెనర్ శిఖర్ ధావన్‌కు బంతులు వేసిన అర్జున్ ఆ తర్వాత కోహ్లీ, రహానే కేదార్ జాదవ్‌లకు బౌలింగ్ చేశాడు.
అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ చేస్తున్న ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అర్జున్ టెండూల్కర్ ఎడమచేతి వాటం పేసర్ అన్న సంగతి తెలిసిందే. మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు భారత జట్టుకు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. అర్జున్ ఇటీవల జేవై లేలే ఆలిండియా అండర్-19 టోర్నమెంటులో ముంబైకి ప్రాతినిధ్యం వహిచాడు.