కెరీర్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న అర్జున్ టెండూల్కర్.. ఇక ముంబైకి సెలవు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ విషయంలో సంచలన నిర్ణయం జరిగింది. అతను దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముంబై జట్టులో అతనికి సరైన అవకాశాలు లభించడం లేదు. అందువల్ల అతను ముంబైకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమయ్యాడు. అతను జట్టులో అవకాశాలు దొరికే వీలున్న గోవా తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్వోసీ కోసం కూడా అతను అప్లై చేశాడు. ఇక అది మంజూరయిందని సమాచారం. అతను త్వరలోనే గోవా తరఫున బరిలోకి దిగబోతున్నాడు.
అర్జున్ టెండూల్కర్ లెఫ్టార్మ్ పేసర్. అతను ప్రాక్టీస్ సెషన్లో తన మార్క్ బౌలింగ్ చూపెడుతుంటాడనే సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ముంబై తరఫున అతను జస్ట్ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ముంబై టీం దేశవాళీ టోర్నీల్లో పేరొందిన మరియు స్టార్లతో కూడిన టీం. అతని కంటే ప్రదర్శన పరంగా రాణిస్తున్నవారు ఉన్నారు. వాళ్లను కాదని అర్జున్‌కు తుది జట్టులో చోటు కల్పించడం చాలా కష్టంగా మారింది. అతనికి అవకాశాలు రాకపోవడంతో.. తన కెరీర్లో వెనకబడుతున్నాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా అతనికి ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి.
ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ సీజన్ 2021-22లో అతన్ని జట్టులో పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఇక ముంబై జట్టుకు ఉంటే అర్జున్‌కు కలిసిరావట్లేదు. అందువల్లే కాస్త కష్టమైన అతను ముంబైని వీడడానికి రెడీ అయ్యాడు. ఇక అర్జున్ తన కెరీర్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పట్లేదు అని అతనికి సంబంధించిన ఓ అధికారి తెలిపాడు. గోవా క్రికెట్ అసోసియేషన్ సైతం అర్జున్ లాంటి లెఫ్టార్మ్ పేసర్ కోసం మేం చాలా రోజులుగా చూస్తున్నాం. అతనికి సాదరంగా వెల్ కమ్ చెబుతామని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications