అర్జున్ తన కలలను సాకారం చేసేందుకే ప్రయత్నించాలి: కుమారుడికి సచిన్ సలహా ఇదే

హైదరాబాద్: అర్జున్ టెండూల్కర్‌కు ఉన్న ఇంటి పేరు అతడిపై ఎంత ఒత్తిడిని తెస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, "నిద్రలేచిన ప్రతిరోజూ ఉదయం తన కలలను సాకారం చేసేందుకే ప్రయత్నించాలి' అని తన కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సలహా ఇచ్చాడు. గతేడాది టీమిండియా అండర్-19 జట్టు తరుఫున రెండు టెస్టులు ఆడిన అర్జున్, ఇటీవలే ముంబయి అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు త్వరలో ముంబై టీ20 రెండో సీజన్‌లో అర్జున్ మొదటిసారి ఆడుతున్నాడు.

సచిన్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా సచిన్ తన కుమారుడి గురించి కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ "అర్జున్ టీ20ల్లో ఆడటం అభిమానులు గమనిస్తారు. అతడి ప్రదర్శన అత్యుత్తమంగా ఉంటే పైకి వస్తాడు. ఒకవేళ ఈసారి విఫలమైనా రేపు మరో అవకాశముంటుంది. అప్పుడు తన తప్పులని సరిచేసుకొని మరింత మెరుగ్గా రాణిస్తాడు" అని అన్నాడు.

ఆటపై శ్రద్ధ ఉండటమే నాకు కావాలి
"అతడికి క్రికెట్‌పై ప్రేమ, ఆటపై శ్రద్ధ ఉండటమే నాకు కావాల్సింది. కెరీర్‌లో ఎత్తు పల్లాలు ఉండటం సహజం. క్రికెట్ ఆడటమే అర్జున్‌కి ఇష్టం. అందులో బాగా రాణించి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు" అని సచిన్ చెప్పుకొచ్చాడు. తనపై తన తండ్రి రమేశ్ టెండూల్కర్ ప్రభావం ఉందని సచిన్ ఈ సందర్భంగా తెలిపాడు.

నా తండ్రి చిన్నప్పుడు చెప్పిన మాటలను
చిన్నప్పుడు తన తండ్రి చిన్నప్పుడు చెప్పిన మాటలను సైతం సచిన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. "ఆటలో మెళకువలు నేర్చుకోలేనంతవరకూ క్రికెట్‌లో విజయం సాధించలేవు" అని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని తన కుమారుడికి చెప్తానని, క్రికెట్ ఆడుతున్నంతకాలం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని సచిన్ అన్నాడు.

మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటే చాలు
ఒక మంచి జట్టులో ఆడుతూ.. మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటే చాలని, అంతకుమించి తానేమీ కోరుకోవడం లేదని సచిన్ ఈ సందర్భంగా చెప్పాడు. ఇక, ముంబై టీ20 గురించి మాట్లాడుతూ యువ క్రికెటర్లకు ఇదొక చక్కటి అవకాశమని, ఆటగాళ్లు తమ సత్తాను చాటేందుకు ఇదొక సరైన వేదకని సచిన్ అన్నాడు.

ఈ టోర్నీలో సత్తా చాటితే ఐపీఎల్‌కు ఎంపిక
గతేడాది ఇదే టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన శుభం రంజానే, శివం దూబే, సుశాంత్‌సింగ్ ఇప్పుడు ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్నారని సచిన్ గుర్తుచేశారు. ఇక్కడ మంచి ప్రదర్శన చేస్తే ఐపీఎల్ ఫ్రాంచైజీలు వీరిని తీసుకుంటాయని.. ఒకవేళ ఫ్రాంచైజీలు తీసుకోకపోయినా వారికో క్రికెట్‌లో ఎదిగేందుకు ఒక మార్గాన్ని చూపిస్తాయని సచిన్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications