For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పూజారా నీకు బోర్ కొట్టడం లేదా.. ? : నాథన్ లయాన్

Ind vs Aus 4th Test : Pujara Are You Not Bored yet? Nathan Lyon Asks India's Run-Machine | Oneindia
Are you not bored yet Pujara? Nathan Lyon asks Indias run-machine

సిడ్నీ: టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా ఆస్ట్రేలియా బౌలర్లకు కఠిన పరీక్షకు గురి చేశాడు. వారు బంతులు వేస్తూ అలసిపోతున్నారు. అంత వరకు ఓపికగా క్రీజులో ఎదురుచూసిన పుజారా కంగారూ బౌలర్లు వేసే చెత్త బంతుల్ని చక్కగా బౌండరీకి తరలించాడు. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా అద్భుత తరహాలో సెంచరీ బాదేశాడు. ఈ సిరీస్‌లో అతడికిది మూడో సెంచరీ 134 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పూజారా.. మరో 65 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలోనే 130 పరుగులు చేసేందుకు 250 బంతులు తీసుకున్నాడు.

22 గంటలపాటు బ్యాటింగ్‌.. 3 సెంచరీలు

22 గంటలపాటు బ్యాటింగ్‌.. 3 సెంచరీలు

తొలి ఇన్నింగ్స్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే వెయ్యికి పైగా బంతులు.. మొత్తంగా 22 గంటలపాటు బ్యాటింగ్‌.. మూడు సెంచరీలు ఇదీ చతేశ్వర్ పుజారా ఆసీ్‌సతో టెస్టు సిరీ‌స్‌లో చూపుతున్న జోరు. అందుకే ఇంత ఓపికను ఎలా కనబరుస్తున్నాడో ఆతిథ్య జట్టు స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌కు కూడా విసుగుతెప్పించింది. అందుకే నేరుగా పూజారానే అడిగేశాడు. తొలి రోజు ఆటలో సెంచరీ తర్వాత నాన్‌స్ట్రయిక్‌ ఎండ్‌లో ఉన్న పుజారాను ‘నీకింకా బోర్‌ కొట్టడం లేదా' అంటూ సరదాగా ప్రశ్నించాడు. దీనికి పుజారా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.

ఫుల్‌ షాట్స్, ముచ్చటైన్ కవర్ డ్రైవ్‌లతో

ఫుల్‌ షాట్స్, ముచ్చటైన్ కవర్ డ్రైవ్‌లతో

శుక్రవారం వ్యక్తిగత స్కోరు 130 వద్ద ఇన్నింగ్స్‌ని కొనసాగించిన చతేశ్వర్ పుజారా.. తొలి సెషన్ నుంచే దూకుడుగా ఆడాడు. పేసర్ల బౌలింగ్‌లో ఫుల్‌ షాట్స్, ముచ్చటైన్ కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. వేగం పెంచాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి అజేయంగా నిలిచాడు.

డబుల్ సెంచరీ మిస్, 193కే

డబుల్ సెంచరీ మిస్, 193కే

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లి.. కాస్తలో అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రెండో రోజు తొలి రోజు దూకుడునే ఆసీస్‌ బౌలర్లపై కొనసాగించాడు. డబుల్ సెంచరీకి దగ్గరగా వచ్చిన పుజారాను నాథన్‌ లయన్‌ పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్‌ 130వ ఓవర్లో నాథన్‌ వేసిన చివరి బంతిని ఆడిన పుజారా (193) అతడికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

1
43626
Story first published: Friday, January 4, 2019, 11:44 [IST]
Other articles published on Jan 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+